అంతేగాని పరమాత్మనే ఉందని లేదని ఇలా విశేషరూపంగా చూచామంటే అది సమ్యగ్దర్శనం కాదు. ఎందుకంటే సామాన్యాన్ని ఆయా విశేషరూపాల స్థాయికి దించి చూస్తున్నాము. చూస్తే ఆమేరకే పరిచ్ఛిన్నమై కనిపిస్తాడు పరమాత్మ. పరమాత్మ తాలూకు అఖండమైన రూపం నీ అనుభవానికి రాదు. అలాగే ఇప్పుడు క్రతు యజ్ఞాది విశేషాలన్నీ పరమాత్మేనని చెప్పినా ఆమేరకే పరిమితంగా చూడరాదా తత్త్వాన్ని. చూస్తే అంతవరకే పరిమితమై కనిపిస్తుంది తత్త్వం. కనిపించే సరి కసలైన తత్త్వాన్ని మరచిపోయి దాని ఆభాసనే పట్టుకొని అదే పరిపూర్ణమైన తత్త్వమని బోల్తా పడతాడు మానవుడు. అదే ఇప్పుడీ ఉపాసకు లందరూ చేస్తున్న పని. ఆదిత్య చంద్రాది దేవతలను వీరు పూజిస్తున్నారంటే ఆ దేవతా మూర్తులే ఎక్కడికక్కడ పరమాత్మ అనే భావనతో పూజిస్తున్నారు. పరిపూర్ణమైన అవగాహన లేదు వీరికి. కనుకనే అసలు ఫలితం లేకుండా పోదు వీరికి. ఉంటే బ్రహ్మాండమైన ఫలితమూ లేదు. ఎప్పటికైనా వీరికీ పరిచ్ఛిన్న దృష్టి పోగొట్టి క్రమంగా ఆ పరిపూర్ణ దృష్టి నందివ్వటానికే పరమాత్మ అహం క్రతురహం యజ్ఞః అని ఇలా వర్ణిస్తూ పోవటం. ఏమిటిలా వర్ణించటంలో ఆంతర్యం. యజ్ఞయాగాదులుగా మంత్రహోమాదులుగా నీవు చేసే క్రియలన్నీ ఆయా క్రియా విశేషాలుగా గాదు నీవు చూడవలసింది. ఆ కలాపమంతా అహంతా రూపమైన పరమాత్మగా చూడు. మరి నీవు యజ్ఞాదులన్నీ ఎవరి కోస మమష్ఠిస్తున్నావో ఆ ధాతా విధాతా - అంటే దేవతలూ దేవతాజ్యేష్ఠు డైన
Page 229