#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

వర్షం నిగృహ్లా మ్యుత్సృ జామిచ. వేసవి కాలంలో ఉష్ణగుణంగా తపిస్తున్నది వర్షం కురవకుండా నిరోధిస్తున్నదీ మరలా వర్షర్తువులో ధారా పాతంగా వర్షిస్తున్నదీ నేనే. ఇంతెందు కిన్ని మాటలు. ఆఖరుకు అమృతం చైవ మృత్యుశ్చ – సదన చ్చాహ మర్జున. ఆఖరుకు మరణమూ అమృతత్వమూ రెండూ నేనే. అలాగే ఉన్నదీ నేనే. లేనిదీ నేనే అని చాటుతున్నాడు. ఈ రెండు మాటల్లో అన్ని భావాలూ కలిసి వచ్చాయి. క్రత్వాదుల దగ్గరి నుంచీ ఏ పదార్ధాలైనా ఏ క్రియాదులైనా సరే. ఉన్నవైనా కావాలవి. లేనివైనా కావాలి. ఉంటే అది అమృతం. లేకుంటే అదే మృతం. వీటికే సప్రతి పక్షాలని పేరు పెట్టారు Opposites భగవత్పాదులు. ఇవే ద్వంద్వాలు కూడా. సుఖ దుఃఖాదులన్నీ ఇలాంటివే. అవన్నీ సదసత్తులనే రెండు ద్వంద్వాలలో చేరిపోతాయి. క్రతువు చేస్తే ఉంటుంది. లేకుంటే లేదు. యజ్ఞం చేస్తే ఉంటుంది. లేకుంటే లేదు. అలాంటప్పుడు సదసత్తులలో చేరిపోని దంటూ ఏముంది.

  అప్పటికి సదసత్తులు రెండు చెబితే చాలు. అంతా చెప్పినట్టే. చిత్ర మేమంటే ఈ సదసత్తులు రెండూ ఏవో కావు మరలా. ఇవి రెండూ కూడా నేనేనని తనమీదికే ఆవాహన చేసుకొన్నాడు. అంటే సత్తూ అసత్తూ ఉన్నదీ లేనిదీ కూడా వాస్తవానికి పరమాత్మే నన్న మాట. పరమాత్మను సదసత్తులనే ద్వంద్వాలుగా గాదు. సదసత్తులనే పరమాత్మగా చూడాలి మనం. అప్పుడీ వి శేషాలు సామాన్యంలో కలిసి పోయి సామాన్య రూపమైన పరమాత్మే మనకు దర్శన మిస్తాడు. అదే సమ్యగ్దర్శనం Right vision.

Page 228

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు