ఇన్ని రూపాలలో కనిపిస్తున్నది కాబట్టి ఉపాసకుడైన వాడే రూపాన్ని పట్టుకొన్నా ఆ రూపం ద్వారా వాడా మూల తత్త్వాన్నే పట్టుకొంటున్నాడని ఇంతకూ సారాంశం. అదే చెబుతున్నా డిప్పుడు భగవానుడు. అహం క్రతు రహం యజ్ఞః క్రతువులూ తానే యాజ్ఞాలూ తానేనట. శౌతమైనది క్రతువైతే స్మార్తమైన కర్మ యజ్ఞం. అవి రెండూ పరమాత్మే. స్వధాహ మహామౌషధం. పితృదేవతల కర్పించే అన్నం స్వధ. సర్వప్రాణులూ ఆహారంగా తీసుకొనేది ఔషధ మంటారు భాష్యకారులు. అవి రెండూ మహమే వాజ్య మహమగ్ని రహం హుతం పరమాత్మే. మంత్రోహ మంత్రమూ నేనే మంత్రపూర్వకంగా హోమం చేసే ఆజ్యమూ నేనే ఆ అగ్నిహోత్రమూ నేనే హవన క్రియా నేనే నంటాడు.
అంతేకాదు. పితాహ మస్య జగతో మాతా ధాతా పితామహః తండ్రీ తల్లీ ధాతా విధాతా అంతా నేనే ఈ ప్రపంచానికి. వేద్యం పవిత్ర మోంకారః ఋక్సామ యజురేవచ. ఋగ్వేదాది వేద వాఙ్మయమూ నేనే దానికి సారభూతమైన ఓంకార మూ నేనే. తద్వారా అందుకోవలసిన వేద్యమైన వస్తువూ నేనే నంటాడు. అంతేకాదు. గతిర్భోక్తా ప్రభుస్సాక్షీ నివాస శ్శరణం సుహృత్. యజ్ఞాది కర్మ ఫలమూ నేనే. పోషకుణ్ణి స్వామినీ నేనే. ప్రాణులు చేసే మంచి చెడ్డలను గమనిస్తున్న సాక్షినీ నేనే. ప్రాణులన్నిటికీ ఆశ్రయమూ నేనే. ఆర్తులైన వారికి శరణ్యమూ నేనే. వారి మేలు కోరేవాడినీ నేనే. అసలీ సమస్తానికీ సృష్టి స్థితిలయాలూ నేనే. నిధానమూ బీజమూ కూడా నేనే. అంతేకాదు. తపా మ్యహ మహం
Page 227