#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

స్ఫురిస్తుంటుంది మనకు. ఒకవేళ ఆ పదార్థ మక్కడ లేకున్నా అది లేదనే స్ఫురణ అయినా ఉంటుంది. ఈ స్ఫురణే చైతన్యమదే ఆత్మ. అది ఎప్పుడూ నేననే రూపంలో ఉంటుందా స్ఫురణ. ప్రతి పదార్ధంలో ఉంటుంది. పదార్ధాలు మారుతున్నా అది మారదు. మారదు గనుకనే దాని కను వృత్తి continuity అని పేరు. మారుతాయి గనుక వాటికి వ్యావృత్తి Dis-continuity అని పేరు. చూడండిప్పుడీ వర్ణనలో అహ మహ మనే శబ్దం సర్వత్రా అనుస్యూతంగా వినిపిస్తున్నది మనకు. అహం క్రతు రహం యజ్ఞః దగ్గరి నుంచి సదసచ్చాహ మనేంత వరకూ ప్రతి ఒక్కచోటా పరుచుకొనే ఉందా అహమనే మాట. పోతే ఇక మిగిలిన భాగాలున్నాయే యజ్ఞః క్రతుః అనేవన్నీ అవి దీనిలాగా వ్యాపించినవి కావు. ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. యజ్ఞం క్రతువు కాదు. క్రతువు స్వధా గాదు. మృత్యు వమృతం కాదు. అమృతం మృత్యువు కాదు. దేని పాటి కదే. అదే తెగిపోవట మంటే. తెగిపోయే వన్నీ విశేషాలే. కాని ఈ విశేషాలన్నిటి లోనూ సమానంగా పరుచుకొని వాటన్నిటినీ సామాన్యరూపంగా వ్యాపించి ఉన్నదా అహమనే ఆత్మ పదార్థమొక్కటే. ఇవి ఎక్కడికక్కడ మారిపోతున్నా అది అలా మారకుండా అనువృత్త మవుతూనే ఉంది చూచారో లేదో.

  కనుకనే అది సామాన్య మివి దాని విశేషాలు. అది స్వరూపం. ఇవన్నీ దాని ఆభాసలు. అది ఆత్మ ఇవి అనాత్మలు. ఆత్మే అనాత్మ రూపంగా కూడా కనిపిస్తున్నది కాబట్టి దానికంటే ఇవి వాస్తవంలో వేరుగావు. దాని విభూతే దాని విస్తారమే ఈ అనాత్మగా తోచే ప్రపంచమంతా. ఇలా అదే

Page 226

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు