#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము



గతిర్భర్తా ప్రభు స్సాక్షీ - నివాస శ్శరణం సుహృత్
ప్రభవః ప్రలయః స్థానం - నిధాన మహ మవ్యయమ్ - 18

తపా మ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యు త్సృజా
మిచ అమృతం చైవ మృత్యుశ్చ సద సచ్చాహ మర్జున - 19


  ప్రతిదానిలో నేను ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కటీ అసలు నా స్వరూపమే. కాబట్టి ఏది ఉపాసించినా నన్నే ఉపాసిస్తున్నారు మానవు లంటాడు పరమాత్మ. అసలు పరమాత్మ కాని పదార్ధమేదీ లేదు. చరా చర పదార్ధాలేవో ఉన్నాయి కనిపిస్తున్నాయని పేరేగాని అది ఛాందోగ్యం చెప్పినట్టు వాచారంభణం వికారో నామధేయం. ఉన్నదా రూపంలో అక్కడ పరమాత్మ తత్త్వమే. అదే నీవు ఆయా రూపాలుగా దర్శిస్తున్నావు. అంత మాత్రమే. ఆయన స్వరూపమైతే ఇవన్నీ దాని విభూతి. స్వరూపం కంటే వేరుగా లేదు విభూతి. సామాన్యరూప మైనది స్వరూపం. దాని విశేషాలు విభూతి. సమానంగా పరచుకొని ఉన్నదేదో అది సామాన్యం. సముద్ర జలం సామాన్యమైతే తరంగ బుద్బుదాదులు దాని విశేషాలు. అవి ఆ జలం కన్నా వేరుగా ఎక్కడ ఉన్నాయి. జలమే అన్ని రూపాలుగా మనకు భాసిస్తున్నది. కనుక రూపాలన్నీ జలమే. జలమే అక్కడ యధార్థంగా ఉన్న పదార్ధం.

  అలాగే ఈ అనాత్మ ప్రపంచంలో వ్యాపించి ఉన్న పదార్ధ మాత్మ చైతన్య మొక్కటే. అలా వ్యాపించిందని ఎలా చెప్పగల మేమిటి నిదర్శన మని అడగవచ్చు. ప్రతి ఒక్క పదార్ధమూ లోకంలో ఉన్నది ఉన్నదనే

Page 225

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు