సర్వత్రా విస్తరించి ఉంది. అదే ఈ సర్వమూ నని చూచే చూపేనట ఆ జ్ఞానం.
పోతే మరి కొందరున్నా రుపాసకులు. వారూ చేస్తుంటా రుపాసన. అయితే అది పృథక్త్వేన. అనన్యంగా కాక దాన్ని తమ కన్యంగా చూస్తూ భజిస్తుంటారు. అన్యమనే సరి కది పరం కాదు. అపరం. ఏమిటది. నామరూపాత్మకం. అదీ ఒకటి గాదు. అనేకం. ఆదిత్య చంద్రాది భేదేన స ఏవ భగవాన్ విష్ణు రవస్థితః ఇతి ఉపాసతే. ఆ పరమాత్మే సూర్యచంద్రాది అనేక రూపాలలో భాసిస్తున్నాడని ఆ దేవతా బుద్ధితో ఆరాధిస్తుంటారని చెబుతారు భాష్యకారులు. ఇంకా కొందరున్నారు. వారు బహుధా విశ్వతో ముఖం. బహుధా అవస్థిత స్స ఏవ భగవాన్ సర్వతో ముఖః విశ్వరూపః ఆ భగవానుడే ఆదిత్య చంద్రాది దేవతా రూపాలుగానే కాక సమస్త చరా చర రూపాలుగా కూడా అవతరించి మనకు దర్శన మిస్తున్నాడని విశ్వరూపో పాసన చేస్తూ పోతారు.
అయితే ఇన్ని విధాలుగా ఇన్ని రూపాలలో ఉపాసిస్తుంటే వారు ప్రతి ఒక్కరూ నిన్నే ఉపాసిస్తున్నారని ఎలా చెప్పగలరని అడిగితే దానికి సమాధాన మిస్తున్నాడు మనకా భగవానుడే స్వయంగా. లేదా ఇప్పిస్తున్నా డాయన చేత వేద వ్యాసమహర్షి.
అహం క్రతు రహం యజ్ఞః స్వధా హమహ మౌషధమ్
మంత్రోహ మహమే వాజ్య - మహ మగ్ని రహం హుతమ్ - 16
పితాహ మస్య జగతో - మాతా ధాతా పితా మహః
వేద్యం పవిత్ర మోంకారః - ఋక్సామ యజురేవచ - 17
Page 224