అన్నారే భజంతి అన్నారే. ఎలా చేయాలా ఉపాసన అని ప్రశ్న వస్తే ఉపాసనా మార్గాలెన్ని ఉన్నాయో అన్నీ ఏకరువు పెడుతున్నది గీత.
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే - యజంతో మాముపాసతే
ఏకత్వేన పృథక్త్వేన - బహుధా విశ్వతో ముఖమ్ - 15
ఉప ఆసన ఉపాసన. దగ్గరగా కూచోటమని శబ్దార్ధం. ఎవరి దగ్గర ఎవరు కూచోవా లంటారు. పరమాత్మ దగ్గర మానవుడి మనస్సు. మనస్సే గదా పట్టుకోవలసిం దెప్పటికైనా పరమాత్మను. మనసాను ద్రష్టవ్యం మనసై వేద మాప్తవ్యమని స్పష్టంగా చెబుతున్నది పైగా ఉపనిషత్తు. అంచేత ప్రాపంచిక మైన భావాలనెలా మనసుతోనే పట్టుకొంటున్నామో అలాగే పారమార్ధికమైన సత్యాన్ని కూడా ఈ మనస్సుతోనే పట్టుకోవలసి ఉంది. అదే ఉపాసన భక్తి.
అయితే పట్టుకోవటం వరకూ బాగానే ఉంది. అది ఎలా పట్టుకోవాలా విధాన మేమిటని అడిగితే కొన్ని వర్ణిస్తున్నారు. అందులో మొట్టమొదటిది జ్ఞానయజ్ఞేన చాప్యన్యే. కొందరు మాత్రమే జ్ఞానయజ్ఞంతో నన్ను యజంతో మాము పాసతే. యజనం చేస్తూ ఉపాసిస్తారు. భగవ ద్విషయమైన జ్ఞానమే ఒక యజ్ఞం. అంతకుమించి వేరే యజ్ఞం లేదు వారికి. అన్యా ము పాసనాం పరిత్యజ్య. అసలైన భగవత్స్వరూప జ్ఞానం తప్ప అన్యమైన ఉపాసన ఏదీ కాదని స్పష్టంగా వ్రాశారు భాష్యకారులు. ఆ జ్ఞానం కూడా ఎలాంటి దట. ఏకత్వేన. ఏకమేవ పరంబ్రహ్మ ఇతి పరమార్ధ దర్శనేన అని వ్రాస్తారు గురువుగారు. ఒకే ఒక పరమాత్మే
Page 223