లాగా ఉత్తమాధికారులమే. ఇక మనం చేయవలసింది ఏదీ లేదు. ఉదాసీనవ దాసీన మన్నారే అలాగే ఉండి పోవచ్చు. లేదా కర్మణ్య కర్య యః పశ్యేత్తన్నారే. అనాత్మలో ఆత్మను ఆత్మలో అనాత్మను కలుపుకొని ఏకంగానూ చూడవచ్చు. మరి అలాటి మహాభాగ్యానికి నోచుకోకపోతే మాత్రమలాటి సర్వాత్మ జ్ఞాన ముదయించటానికి పూర్వరంగంగా కొంత శిక్షణ పొందవలసి ఉంటుంది. దానికి జ్ఞానాభ్యాస మని పేరు. జ్ఞానం కోస మభ్యాసమని అర్ధం. ఏమిటది. సతతం కీర్తయంతో మాం. ఎడ తెగకుండా నన్ను కీర్తిస్తుండా లంటాడు పరమాత్మ. సర్వకాల సర్వావస్థలలో ఏమరకుండా సాధ్యమై నంతవరకూ భగవత్తత్త్వాన్ని స్మరిస్తూ ఉండాలి. అలాగే యతంతశ్చ. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎలాగ. ఇంద్రియోప సంహార శమదమ దయాహింసాది లక్షణైః ధర్మైః అంటున్నారు భాష్యకారులు. శమదమాదులైన దైవగుణ సంపత్తి నలవరుచుకొని మనస్సుకు పట్టిన కల్మషాన్ని కడిగి వేసి దాన్ని శుద్ధి చేసుకోవాలి.
అంతేకాదు. దృఢ వ్రతాః - స్థిర మైన అవిచలమైన దీక్ష వహించాలి. అదే జీవితానికి లక్ష్యమని తదభి ముఖంగానే ప్రయాణం సాగించాలి. తమ హృదయంలో నిత్యమూ తిష్ఠ వేసుకొని కూచున్న ఆ భగవత్తత్త్వాని కెప్పుడూ నమస్యం తశ్చ. శరణాగతులై నిత్యయుక్తా ఉపాసతే - భక్తితో నిత్యమూ దాన్నే భజిస్తూ జీవయాత్ర సాగించాలి. అలా చేస్తూ పోతే క్రమంగా సత్త్వ శుద్ధి ఏర్పడి తన్నిమిత్తంగా జ్ఞాన ముదయిస్తుంది. అయితే ఉపాసతే
Page 222