#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

భజించలేరు. ఎంచేత. తమకా దైవాన్ని అన్యంగానే భావిస్తుంటారు. అందుకే వారికేది గాని అపరంగానే దర్శన మిస్తుంటుంది. పరమైన తత్త్వం అనుభవానికి రాదు. అంతేకాదు. జ్ఞాత్వా భూతాది మవ్యయ మంటున్నాడు. భూతాలంటే వియదాదీనాం ప్రాణినాంచ. ఆకాశాది అచేతన పదార్ధాలే గాక చేతన పదార్ధాలైన జీవులు కూడా. ఉభయులకూ ఆది మూలకారణ మంటారు భగవత్పాదులు. అలాటి మూలభూతమైన తత్త్వమే సర్వవ్యాపకంగా సర్వానికీ అనన్యంగా ఉందనే సత్యాన్ని జ్ఞాత్వా చక్కగా దర్శిస్తారట వారు. ఇక్కడ జ్ఞాత్వా అనటం మూలాన జ్ఞానమొక్కటే సాధనమా పరమాత్మనందు కోటానికి మరేదీ కాదని స్పష్టంగా తెలిసిపోతున్నది గీతా హృదయం మనకు. లేకుంటే కర్మధ్యాన యోగమంత్ర తంత్రాదులు కూడా మార్గాలేమో ననే జిడ్డు వదలిపోదు మానవులకు. జ్ఞానమొక్కటే నని తెగేసి చెప్పటం వల్ల అవన్నీ కొట్టి పారేసి నట్టయింది. కాకున్నా క్రొత్తగా తయారు చేసుకో వలసింది కాదు గదా పరమాత్మ. మన ప్రయత్నానికి ముందే సిద్ధమయి ఉంది. పైగా మన స్వరూపంగానే ఉంది. అలాంటప్పుడు కేవలం గుర్తించటమే దాని సాధన. దాని అనుభవం. అనుభవానికి వస్తే అవ్యయం. ఇక వ్యయమయి పోయే ప్రమాదం కూడా లేదు.

సతతం కీర్తయంతో మాం - యతం తశ్చ దృఢ ప్రతాః
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే -14


  కాబట్టి ఇంతకూ చెప్పవచ్చే దేమంటే అలాటి బ్రహ్మజ్ఞాన మనండి. ఆత్మ జ్ఞానమనండి. ఒక్కసారిగా కలిగితే మనం ధన్యులమే. ప్రహ్లాదాదుల

Page 221

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు