#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

అసలును గాక నకలును పట్టుకొని ఊరేగుతున్నారు. నకలు నకలే. పనికిమాలిన ఆలోచనలూ మాటలూ చేష్టలే గాక సాత్త్వికమైన భావాలు ఎలా వస్తాయి. కనుకనే ఛింధి భింధి పిబ ఖాద - కొట్టు చంపు తిను తాగు అని కారుకూతలు కూయటానికి కూడా వెనుదీయ రంటారు భగవత్పాదులు. జ్యోతి ష్టో మాది యాగాలు చేసి సోమపానం చేసే సోమయాజుల దగ్గరి నుంచి మద్యపానం చేసి మత్తెక్కి పడిపోయే పామర జనం వరకూ అందరినీ ఒకగాట కట్టేసి మాటాడుతున్నారు స్వామివారు. వారికి స్వర్గాది సుఖాలిచ్చినా ఒక్కటే. వీరికి నరకాది దుఃఖాలు ప్రాప్తించినా ఒకటే. అసుర్యా నామతే లోకాః అని ఉపనిషత్తు చెప్పినట్టు రెండూ మోఘమైన జీవితమే. అమోఘ మేదీ గాదు. అసలైన తత్త్వజ్ఞాన మెవరికీ లేదు. దొన్నూ దొన్నే నంటాడు. మరి భగవద్భక్తి లక్షణమైన మోక్షమార్గంలో ప్రవర్తించే మహనీయు లెవరో వారెలా ఉంటారని అడిగితే చెబుతున్నది .

మహాత్మాన స్తు మాం పార్థ - దైవీం ప్రకృతి మాశ్రితాః
భజం త్యనన్య మనసో - జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ - 13


  దైవీం ప్రకృతి మాశ్రితాః వారి దాసురమూ రాక్షసమూ అయిన ప్రకృతి అయితే వీరిది దైవమైన ప్రకృతి. కేవల సత్త్వగుణ ప్రధాన మైనది. రజస్తమో మాలిన్యం లేకపోతే సత్త్వం పరిశుద్ధం. శుద్ధమైన సత్త్వంలో నుంచే జ్ఞానమనేది ఉదయిస్తుంది. అది పరమైన భావాన్నే చూపుతుంది గాని అపరమైన భావాన్ని చూపదు. అపరం పరమాత్మ నకలైతే పరమాయన

Page 219

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు