ఉదాహరణలు. మనుష్యాణాం సహస్రేషు అని అందుకే వాపోయింది భగవద్గీత. ఇలా వారికీ వీరికీ కూడా నూటికి తొంభయి తొమ్మిది మంది కంతు పట్టలేదు గనుకనే వీరందరూ ఆ పరమాత్మ అసలెక్కడా లేడనీ ఉన్నా అది మనలాగా ఒక నామరూపాత్మకమైన విగ్రహమే గదా విశేషమే ముందనీ - తేలికగా చూస్తున్నారు. ఇంకా దూరం పోయి తూలనాడు తున్నారు కూడా. దీని కంతటికీ కారణమా పరమాత్మ పరతత్త్వ మేమిటో బయటపడి కనిపించేది కాకపోవటం. వీరికి కనిపించే దంతా ఆయనగారి అపరమైన రూపమే అయి కూచోటం. అంటే అసలు కనపడటం లేదు. నకలు కనపడి సుఖం లేదు. ఈ నకలు కూడా అసలే. ఇలా నకలుగా భాసిస్తున్నదనే టంత చూపు లేదు. ఇదీ విషయం. దీనివల్ల ఆ భగవత్తత్త్వాని కేమీ బాధ లేదు. మోస పోయేది చెడి పోయేది మందబుద్ధులైన ఈ మానవులే. అవజ్ఞాన భావనేన ఆహ తాస్తే వరాకాః అని ఒక్క మాటలో తేల్చిపారేశారీ భావాన్నే భాష్యకారులు.
మోఘాశా మోఘకర్మాణో మోఘ జ్ఞానా విచేతసః
రాక్షసీ మాసురీం చైవ - ప్రకృతిం మోహినీం శ్రితాః - 12
ఎప్పుడైతే వీరా పరమాత్మ అంటే ఏమిటో దాని అసలైన స్వరూపాన్ని గుర్తించలేదో అప్పుడిక వీరి జీవితాని కర్థమే లేదు. గమ్యం లేని జీవితం జీవిస్తుంటారు. మోఘాశాః వ్యర్ధమైన కోరికలు పెట్టుకొని వాటితో సతమత మవుతుంటారు. గుడ్డిగా వాటి వెంటబడి పోతుంటారు. ఆఖరుకు లౌకికమే గాదు. పారలౌకికమైన కోరికలు కూడా పనికి మాలినవే. అలాటి కోరికలు
Page 217