ఇదంతా మన భావనే Notion or imagination మన బుద్ధి పడే పాటే. ఆ బుద్ధితో సహా ఇదంతా చివరకు నిరూపణ చేసి చూస్తే మొత్త మాభాసే. చైతన్య దృష్టితోనే వాస్తవంగాని ఇది - తద్భిన్న మని చూస్తే ఎంత స్పష్టంగా కనిపిస్తున్నా అసత్యమే. ఇదీ మనం గ్రహించ వలసిన రహస్యం. ఇప్పు డర్ధ మవుతుంది మనకు కృష్ణావతార మనేదేమిటో. ఆయన జీవిత మేమిటో ఆయన చేసిన చర్య లేమిటో. అర్థం చేసుకోకపోతే అంతా రంకూ బొంకూ. చేసుకోగలిగితే బ్రహ్మాండమైన లీల. వినోదం. అలాగే అర్థం చేసుకోకపోతే రామావతారమూ ఇంతే. కృష్ణుడి కన్నా మోసమింకా ఆ అవతారం. కృష్ణుడైనా మానవాతీతంగా వ్యవహరిస్తూ మనకు నమ్మకం పుట్టిస్తాడు పరమాత్మే నని. కాని రాముడలా కాక యావజ్జీవమూ మానవ మాత్రుడుగానే ప్రవర్తించి మనలను ఇంకా బేలు పుచ్చుతాడు. పైగా ఆత్మానం మానుషం మన్యే అని అబద్ధం కూడా ఎంతో సత్యమయినట్టు ఆ రంగు పూసి నిబద్ధ మేననిపిస్తాడు. మరీ మోసం.
ఈ విధంగా తన అసలు రూపాన్ని కప్పిపుచ్చి నకిలీ రూపంలో కనపడుతూ అలాగే వ్యవహరించటం వల్ల అప్పుడూ ఇప్పుడూ కూడా భగవత్తత్త్వ మేమిటో అంతు పట్టటం లేదు లోకులకు. అప్పుడు పట్టలేదని చెప్పటానికి పరశురామ దశరధ వాలి రావణాదులూ శిశుపాల జరాసంధ నంద యశోదాదులైతే - ఇప్పుడీ రోజుల్లో అర్థం కాలేదని చెప్పటానికి లోకంలో ఎక్కడబడితే అక్కడ మనకు దర్శనమిచ్చే నాస్తికులూ హేతువాదులూ భౌతిక వాదులూ విజ్ఞానశాస్త్రజ్ఞులే Scientists గొప్ప
Page 216