తెలియకపోవటమే - ఎలా ఉంటుందది. భూతమహేశ్వరం. సమస్తమైన భూత భౌతిక పదార్ధాలకు విలక్షణమై వీటన్నిటినీ నాశనం చేసేది అదుపులో పెట్టుకొనే దేదో అది భూత మహేశ్వరం. అలాటి రూపమా పరరూపం. అప్పటికి పర మపరమని రెండు రూపా లున్నాయన్న మాట పరమాత్మకు. పరం నామరూప రహితం. అశరీరం ఆకాశ కల్పం. ఆకాశాదపి అంతర తమమని అర్థం చెబుతున్నారు భగవత్పాదులు. ఆకాశంలాగా నిరాకారమూ అనంతమూ అంతకన్నా అంతర తమమైనదీ నట. అంటే ఇది జడమైతే అది చేతనమైన ఆకాశం. అది పరమైన భావం పరమాత్మకు. అదే ఆయన అసలు రూపం. మరి అపర మేమిటి. ఆయన మాయాశక్తి ద్వారా కల్పించుకొన్న ఒక మాయామయమైన శరీరం. అదే రామకృష్ణా ద్యవతరాలూ ఆ విగ్రహాలూ. అది అశరీరమైతే ఇది సశరీరం. అది వ్యాపకమైతే ఇది పరిమితం. పరిచ్ఛిన్నం. అది అసలైతే ఇది దాని నకలు. అది ఉన్న పదార్థమైతే ఇది లేకున్నా ఉన్నట్టు భాసించేది. దీనికే ఆభాస అని పేరు పెట్టా రద్వైతులు.
ఇంతెందుకు. మత్స్య కూర్మా ద్యవతారాలన్నీ ఆ భాసలే. అవే కావా భాసలు. ఆమాటకు వస్తే సర్వవ్యాపకమైన చైతన్యమొకటి తప్ప జీవ జగదీశ్వరులుగా కనిపించే ఈ సమస్తమూ ఆభాసే. వాస్తవం కాదు. మనమిలా జన్మిస్తున్నా ఈ ఉపాధితో జీవిస్తున్నా మరణిస్తున్నా జీవితాంతమూ ఈ చుట్టూ ఉన్న ప్రపంచమొకటి ఉందని దానితో వ్యవహరిస్తున్నా దీనికొక కర్త ఉన్నాడు - వాడీశ్వరుడని భావిస్తున్నా
Page 215