కవమానిస్తున్నారని అడిగితే చెబుతున్నాడు - మానుషీం తను మాశ్రితం మనుష్య శరీరం ధరించిన నేరానికి. ఆశ్రిత మని చెప్పటంలో పరమాత్మకు శరీరం సహజంగా లేదని మధ్యలో కావాలని తెచ్చి తగిలించుకొన్నదని అర్థమవుతున్నది. మనబోటి జీవులకైతే తగిలించుకొన్నది గాదు. తగులు కొన్నది. ఎందుకంటే తగిలించు కొన్నదైతే బుద్ధిపూర్వకంగా తగిలించుకొన్నది కాబట్టి మళ్లీ బుద్ధి పూర్వకంగా వదిలించుకోగలం. కాని మన ప్రయత్న మేమీ లేదు. ప్రారబ్ధవశాత్తూ వచ్చింది. ప్రారబ్ధం తీరితే పోతుంది. పరమాత్మ విషయమలా కాదు. ఆయన కజ్ఞానం ప్రారబ్ధమనే ప్రశ్న లేదు. కాబట్టి శరీరమనే ఉపాధి దానిపాటికది లేదు. కాని మాయాశక్తి ప్రభావంతో కావాలని సంకల్పిస్తే మాత్రం అప్పటికప్పు డొక శరీరం ధరించగలడు. మరలా దానివల్ల తాననుకొన్న ప్రయోజనం తీరిపోతే విసర్జించి వెళ్లిపోగలడు. ఆ రావట మవతారమైతే ఈ పోవటం నిర్యాణ మన్నారు పెద్దలు. అందుకే మానుషమైన తనువు తనకు లేకపోయినా ఆశ్రయించాడని చెప్పటం. అది తెలుసుకొనేంత స్తోమత లేక ఆయన కూడా మనలాగే దేహ బంధంతో బ్రతుకుతూ మనలాగే కష్టసుఖా లనుభవిస్తూ బ్రతుకుతున్నాడని మనలాగే చివరకు చేసేది లేక కన్ను మూస్తున్నాడని తమ స్థాయికి దించి చూస్తుంటారు లోకులు. కనుకనే వారిని మూఢులని పేర్కొంటున్నాడు భగవానుడు. మూఢులంటే వివేక జ్ఞానం లేని పామరులు.
మరి వివేక జ్ఞానమనేది ఎందుకు లేదీ మానవులకు. దానికొక్కటే కారణం. పరం భావ మజానంతః ఆయన పరతత్త్వమేమిటో
Page 214