అధ్యక్ష స్థానంలో ఉండి అన్నిటినీ గమనిస్తున్నదని మరొక చేతన పదార్ధమేదీ లేదని గదా. మరొక చేతనమేదీ లేదంటే జీవుడు లేడనేగా. జీవుడు లేకపోతే ఇక కర్త ఎవడు భోక్త ఎవడు. భోగమంటే సుఖదుఃఖానుభవమే. అది సంసారమే. సంసారమనేది భోక్త అయిన జీవుడుంటే గాని ఏర్పడదు. మరి జీవుడో. అధ్యక్షమైన చైతన్యం కంటే వేరుగా లేడు. జీవజగత్తులు రెండూ ఎప్పుడు లేవో అప్పుడీ సృష్టి ఎవరు చేశారిది ఎక్కడిదని ప్రశ్నే లేదు. అయినా మాకు కనపడుతున్నదే మేము చూస్తున్నామే అనుభవిస్తున్నామే అంటే అది నీ దృష్టి దోషం. అనాదికాల ప్రవృత్తమైన జీవుడి అజ్ఞానం. అదే అవిద్యా లక్షణమైన ప్రకృతి అని మేము ఘోషించటం. అజ్ఞానేనా వృతం జ్ఞానం తేనముహ్యంతి జంతవః అని ఇంతకుముందే దీనికి పరిష్కారం చేసి చూపింది భగవద్గీత అని మనకు గుర్తు చేస్తారు భాష్యకారులు.
మరి ఇలాగా నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావమూ సర్వజ్ఞమూ సర్వ ప్రపంచానికీ ఆత్మ భూతమూ అని తన స్వరూపాన్ని పరమాత్మ లోకాని కెంతగా చాటి చెబుతున్నా అది మంద బుద్ధులైన మానవుల కెంత మాత్రమూ మనసుకు పట్టటం లేదు. లేక ఏమి చేస్తున్నారు.
అవ జానంతి మాం మూఢా- మానుషీం తను మాశ్రితం
పరం భావ మజానంతో- మమభూత మహేశ్వరమ్ - 11
అవజానంతి మాం మూఢాః - నన్ను తక్కువ చేసి చూస్తున్నారు. చిన్న చూపు చూస్తున్నారు. అవమానిస్తున్నారు మూఢులు. ఎందు
Page 213