#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

కారణం వల్లనే కొంప మునుగుతున్నది. సచరాచరమైన ఈ ప్రపంచమంతా ఇలా నిరంతరమూ చక్రాకారంగా పరిభ్రమిస్తున్నది. ఏమిటీ మాటల కర్ధం. ఆయన ఉదాసీనంగా ఉండి చూస్తుంటే ఇది ఇలా పరిభ్రమించట మేమిటి. అదేమిటో ఎలాగో భగవత్పాదులే మనకు తెలియ పరుస్తున్నారు వినండి. దృశికర్మ త్వాపత్తి నిమిత్తాహి జగత స్సర్వా ప్రవృత్తిః - ప్రపంచం తాలూకు సృష్టి లయాది వ్యాపారాలన్నీ ఇలా సాగిపోతున్నా యంటే దానికి నిమిత్తమిది ఆ పరమాత్మ జ్ఞానానికి విషయం Object కావటమే. అది ఎలాగంటే వివరిస్తున్నా రాయన. అహమిదం భోక్ష్యే - పశ్యామీదం - శృణోమీదం నేనిది అనుభవిస్తాను - ఇది చూస్తున్నాను - ఇది వింటున్నాను - సుఖ మనుభవామి - దుఃఖ మనుభవామి సుఖ మనుభవిస్తున్నాను - దుఃఖ మనుభవిస్తున్నాను - సుఖమూ దుఃఖమూ అనుభవిస్తున్నాను - తదర్ధ మిదంకరి ష్యే - ఇదం జ్ఞాస్యామి - అందుకోస మీపని చేస్తాను - ఈ విషయం తెలుసుకొంటాను అని ఇలా ప్రతి ఒక్కటీ నీ జ్ఞానానికి విషయంగా చూస్తున్నావా లేదా. ఆలోచిస్తే అవగతి నిష్ఠా అవగత్యవసానైవ సర్వాప్రవృత్తిః నీ ప్రవృత్తి ప్రతి ఒక్కటీ అవగతిలోనే ఏర్పడుతుంది. అవగతిలోనే ఉంటున్నది. అవగతిలోనే సమసిపోతున్నది. అవగతి అంటే జ్ఞానమే దృక్కే, దృక్కు నీ స్వరూపమైతే దానికి దృశ్యమయ్యేదే ప్రతి వస్తువూ ప్రతి వ్యాపారమూ.

  అలాంటప్పుడేమని అర్థం చేసుకోవాలి మనం. సర్వాధ్యక్ష భూత చైతన్య మాత్రస్య అన్యస్య చేతనాంతరస్య అభావే. ఒకే ఒక దృక్కు అన్నిటికీ

Page 212

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు