చూచేవాడని అర్ధం. Over seer or supervisor. కర్మాధ్యక్ష స్సర్వభూతాధివాసః సాక్షీచేతా కేవలో నిర్గుణ శ్చ అని శ్వేతాశ్వతర మంత్రం. దృశిమాత్ర స్వరూపేణ అవిక్రియాత్మనా అని వ్రాస్తున్నారు స్వామివారు. కేవలం దృక్కు మాత్రమే పరమాత్మ అంటే Vision is his form. మరేదీ గాదు. దృక్కంటే జ్ఞానం. అది నిరాకారం గనుక నిర్వికారం. అది ఎలా సృష్టించగలదీ ప్రపంచాన్ని.
మరి అదిగాక పోతే ఎవరు. ఉన్నదది ఒక్కటే మరేదీ లేదన్నారు గదా. ఒకవేళ దాని ప్రకృతి అని చెప్పినా అది కూడా అదే గదా. నిజమే. నహి దృష్టే అనుపపన్నం నామ అన్నారు పెద్దలు. ఒక పక్క కనిపిస్తుంటే ఇది ఎక్కడిది ఎలా చెల్లుతుందని ప్రశ్న లేదట. చెల్లకపోతే ఎలా కనిపిస్తుందని జవాబు. అలాగే పరమాత్మ దృష్టితో చెల్లదీ సృష్టి. అది విద్యా ప్రకృతి అని పేర్కొన్నాము. పోతే దానికి భిన్నంగా జీవుడి దవిద్యా ప్రకృతి. కనుక వీడి దృష్టి కాయనగారే ఈ సృష్టి చేసినట్టు కనిపిస్తున్నాడు. అందుకే మానవుడి దృష్టిని బట్టి భూతగ్రామం విసృజామి అనే మాటా కరక్టే. పరమాత్మ దృష్టిని బట్టి ఉదాసీన వ దాసీన మనే మాటా కరెక్టే నని పరిష్కారం.
అయినా మానవుడి దృష్టినే అనుసరించి చెప్పవచ్చుగాక. అప్పటికీ పరమాత్మ ప్రమేయం లేకుండా కేవల మల్పజ్ఞుడైన జీవుడూ అచేతనమైన జగత్తూ ఈ రెండింటి వల్లనే ఇంత పెద్ద కామాట మేర్పడుతుందా అని ఇప్పటికీ మన కనుమానమే. ఆ చిక్కుముడి కూడా విప్పుతున్న దిప్పుడు భగవద్గీత. హేతునానేన కౌంతేయ - జగ ద్విపరివర్తతే. ఈ అధ్యక్షత్వమనే
Page 211