#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

మరొకటి అవిద్యా లక్షణ. రెండూ ఆయనకు సంబంధించినవే. ఎందుకంటే ఉన్నదొకే ఒక ఆత్మ తత్త్వం. కనుక ఏదైనా దానిదే అయి ఉండాలి. కాని చిత్రమేమంటే ఆయన కేవల ప్రజ్ఞాన స్వరూపుడు కాబట్టి అవిద్యారూపంగా ఉండదక్కడ ప్రకృతి. విద్యారూపంగా మాత్రమే ఉండిపోతుంది. అదే మనబోటి జీవకోటి దగ్గర జేరే సరికి అవిద్యారూపంగా పనిచేస్తుంది. అందుకే ఆయనకు కనపడదీ సృష్టి, నీకూ నాకూ కనిపిస్తుంటుంది. అందుకే ప్రకృతి స్సూయతే సచరా చరం. త్రిగుణాత్మికా అవిద్యా లక్షణా ప్రకృతిః అని అర్ధం చెబుతారు భాష్యకారులు. ఇలాటి అవిద్యా లక్షణమైన ప్రకృతి మన దగ్గర ఉండటం మూలాన్నే మన మీ సృష్టి అంతా ఇలా త్రిగుణాత్మకంగా ఆయనగారే చేస్తున్నట్టు మనకు భ్రమ గొలుపుతున్నది.

  పోతే ఆయన దగ్గర ఉన్నదిలాటి అవిద్యా ప్రకృతి కాదు. అది విద్యా ప్రకృతి. ఆయన కేవల దృక్స్వరూపుడైతే ఇది ఆయనను కేవలం దృగ్రూపంగానే ఆశ్రయించి ఉన్నది. కనుక ఆయన దృష్టికిది సవికల్పంగా విషమంగా ఎప్పుడూ కనిపించదు. తన లాగే ఇది కూడా నిర్వికల్పంగా సామాన్యరూపంగానే దర్శనమిస్తుంది. ఒక గారడీ ప్రేక్షకులూ చూస్తుంటారు. ఆ గారడీ చేసేవాడూ చూస్తుంటాడు. కాని వీరికది అన్యంగా అనేకంగా చిత్ర విచిత్రంగా కనిపిస్తే వాడికలా కాక అనన్యంగా ఏకంగా తన స్వరూపంగానే దర్శన మిస్తుందా లేదా. అలాగే దర్శన మిస్తుందీ సృష్టి వైచిత్రి పరమాత్మకు. కనుకనే మయా అధ్యక్షేణ అంటున్నది గీత. పరమాత్మ కేవల మధ్యక్షుడీ జగన్నాటకానికి. అధి అక్ష అధ్యక్ష. పయి నుంచి

Page 210

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు