లేదు దానికి. అవిక్రియం గనుక ఫలా సంగమూ లేదు. కర్తృత్వాభిమానమూ ఫలాసక్తీ అనే భోక్తృత్వ బుద్ధీ రెండూ లేవు గనుకనే దానికి దేనితోనూ సంబంధంలేదు.
దానికి లేవని చెప్పటం మాత్రమే గాదు మా ఉద్దేశం. కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ పెట్టుకోక పోతే మీరు కూడా ధన్యులే. జీవుడి స్థాయినుంచి పైకెదిగి మీరే పరమాత్మ స్వరూపులై నిలుస్తారు. మీకూ కర్మ లేవీ అంటవు. అప్పు డీశ్వరుడనే వాడొకడు మీకు వేరుగా కనపడడు. వాడీ సృష్టి ఎందుకింత విషమంగా చేశాడనే ప్రశ్నా రాదు. అసలు నీకీ సృష్టే కనపడదు. అలాంటి అవకాశమే లేదు. భాష్యకారులిలా అద్భుతంగా వ్యాఖ్యానించి పరిష్కరించారీ సృష్టి సమస్యను.
మయా ధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరం
హేతు నానేన కౌంతేయ - జగ ద్విపరి వర్తతే - 10
అలాంటప్పు డెందుకీ మాట అన్నది భగవద్గీత. భూత గ్రామ మిమం విసృజామి అని ఒక మాటా ఉదాసీన వ దాసీనమని మరొక మాటా ఎందుకింత పరస్పర విరుద్ధమైన భావాలు చెప్పవలసి వచ్చిందని ప్రశ్న. ఇది భాష్యకారులకే వచ్చిందీ ప్రశ్న. వచ్చే దీన్ని తన అవతారికలో ఉదాహరించారు. దానికి మరి భగవద్గీత ఏమి సంజాయిషీ ఇస్తున్నదో ఆలకిద్దాము. మయాధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరం. ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచాన్ని నేను గాదు నా ప్రకృతి సృష్టించిందంటా డాయన. నా ప్రకృతి అంటే రెండున్నాయి ప్రకృతులు. ఒకటి విద్యాలక్షణ.
Page 209