నీకు ప్రపంచంగా కనిపిస్తున్నాడు. నీ దృష్టి సహకరించక పోతే తన కలాటి శక్తి ఎంత ఉన్నా కనిపించాలనే చాపల్యం లేదాయనకు. రజ్జువు తన పాటికి తానెప్పుడైనా సర్పంగా మారి కనిపిస్తుందా నీకు. నీవు చూస్తే మాత్రం కనిపిస్తుంది. అలాగే నీవు అవిద్యా దృష్టి వదలకుండా చూస్తున్నావీ ప్రపంచాన్ని. అందుకే నీకిలా కనిపిస్తున్నది. కనిపిస్తుంటే అది నీ అజ్ఞానం వల్ల ననే విషయం మరచిపోయి ఆయన ఎందుకిలా సృష్టించాలని నీ అవిద్యా దోష మాయన కంట గడుతున్నావు. అంటగట్టినా అంటించుకొనే వాడు కాడాయన. రజ్జువు మీద నీవు సర్పమనే భావ మారోపించినా అది దాన్ని ఎలా అంటదో అలాగే పరమాత్మకు నీవు సృష్టి ప్రళయా లా రోపించినా ఆయన కంటవు.
నచ మాంతాని కర్మాణి నిబధ్నంతి అంటున్నా డాయన. విషమ సర్గ నిమిత్తాని కర్మాణి మాం న నిబధ్నంతి. ఇంత విషమంగా ఈ సృష్టి ఎందుకు చేశాడనే దోషం నన్నంటదని వ్యాఖ్యానిస్తారు భాష్యకారులు. కారణమేమంటే ఉదాసీనవ దాసీనం - ఉదాసీను డాయన. మంచిగా సృష్టించాలనే రాగమూ లేదు. చెడ్డగా చేయాలనే ద్వేషమూ లేదు. కేవల ముపేక్షకు డాయన. ఎటూ మొగ్గు చూపడు. ఎందుకని. ఆత్మనః అవిక్రియత్వాత్. ఆత్మ శుద్ధ చైతన్యం నిరాకారం. దానికెలాంటి వికారమూ లేదు. అంతేకాక అసక్తం తేషు కర్మసు. అలాటి నిర్వికారమైన తత్త్వ మేది చేసిందని నీవు భావించినా అది ఆ సృష్టి వ్యాపారాదుల్లో అసక్తం. ఎలాటి సాంగత్యమూ పెట్టుకోదు. అహం కరోమి అనే కర్తృత్వాభిమానమూ
Page 208