లేనే లేదు. అంతా మనదృష్టి కాత్మ స్వరూపమే. అప్పుడు ప్రశ్నా లేదు. సమాధానమూ లేదు.
నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ
ఉదాసీన వ దాసీన మసక్తం తేషు కర్మసు - 9
అయితే మా సంగతి అలా ఉంచండి. మేము అవిద్యా వశవర్తుల మయితే కావచ్చు. ఆయనగారు విద్యావంతుడు గదా. ఎందుకిలా సృష్టి చేసి మన ప్రాణం తీస్తున్నాడని నీ వాక్షేపించవచ్చు. దానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే విద్యా శక్తి చేతిలో ఉంది గదా అని తనపాటికి తాను చేయడెప్పుడూ. ఒక ఐంద్రజాలికుడైనా తన విద్యాబలంతో నీకిష్టమున్నా లేకున్నా తన శక్తిని ప్రదర్శించటం కోసం అవీ ఇవీ సృష్టిస్తే సృష్టిస్తాడేమో గాని పరమాత్మ అనే పెద్ద ఐంద్రజాలికుడి కెంత శక్తి ఉన్నా అలా ఎప్పటికీ నిరంకుశంగా సృష్టి చేయాలనే చాపల్యం లేదు. ఉంటే వాడు వాస్తవంగానే దీనికి కర్త అవుతాడు. కర్త అయితే దీని ఫలితం కూడా తానే అనుభవించ వలసిన భోక్త కూడా కాక తప్పదు. అప్పుడు జీవుడు తప్పించుకొని సంసార బంధం వాడి మెడకు చుట్టుకొంటుంది.
అయితే మరెలా జరిగిందంటారు సృష్టి. జరిగిందని ఎవరు చెప్పారు. వాడుగా చేస్తే గదా. ఎవరు చేశారు. నీవూ నీ దృష్టి చేసిందీ సృష్టి. రజ్జువును సర్పంగా చూచినట్టు పరమాత్మనే ప్రపంచమని చూస్తున్నావు నీవు. సర్పమనే నీ దృష్టిని బట్టి రజ్జువు నీకు సర్పంగా కనిపించింది. తన పాటికి తాను గాదు. అలాగే ప్రపంచమని నీవు చూచే దృష్టిని బట్టి పరమాత్మ
Page 207