భాసిస్తున్నాడు. అప్పటికీ ప్రపంచమేదో గాదు. అవ్యక్తమైన ఆశక్తే. ఆశక్తి ఏదో గాదు. పరమాత్మే. ప్రకృతి సృష్టించిందంటే అప్పటికి పరమాత్మే సృష్టించాడని అర్ధం.
బాగానే ఉంది కాని ఇప్పుడొక చిక్కు ప్రశ్నకు జవాబు రావాలి
మనకు. పరమాత్మే సృష్టించాడీ జీవ జగత్తులని నిర్ధారణ చేశారు మీరు.
అది ఆయన దృష్టితో చూస్తే ఒక వినోదం కావచ్చు. కాని మన దృష్టితో
చూస్తే అంత కన్నా దారుణమైన విషాద మేముంది. అనుభవించ వలసినది
మనబోటి జీవులమే గదా. ఆయన చేసిన దానికి మనమెందుకింత సంసార
క్లేశ మనుభవించాలి. ఏమిటి దీనికి న్యాయం. ధర్మం. ఒక టెర్రరిస్టుకూ
పరమాత్మకూ తేడా ఏముంది. ఎలా సమర్ధించ గల వాయన చేసిన ఈ
దారుణాన్ని. నిజమే. ఆయన తన పాటికి తాను నిరంకుశంగా చేస్తే నీవు
చేసిన ఆక్షేపణకు జవాబు లేదు. కారణం. ఆయన ప్రకృతి విద్యారూపిణి
అయితే మనది అవిద్యారూపిణి అని మొదటనే పేర్కొన్నాము. అవిద్యా
ప్రకృతికి వశమై చూస్తున్నాము కాబట్టి ఇది ఒక సృష్టి అనీ ఎవరో దీన్ని
చేసి మన నెత్తిన పడేశారనే భ్రమపడుతున్నాము. విద్యాదృష్టితో చూస్తే
అసలు మనకు భిన్నంగా ఒక ఈశ్వరుడూ లేడు. సృష్టి లేదు. దానివల్ల
మనం బాధ పడటమూ లేదు. అంతా వట్టి భ్రమ. అదే చెబుతున్నా డిప్పుడు.
అవశం ప్రకృతే ర్వశాత్తని. అవిద్యారూపిణి అయిన ప్రకృతికి వశమై ఇలా
అపోహ పడుతున్నాము మనబోటి జీవులమంతా. బ్రహ్మ విద్యకు నోచుకోక
ఏకమైన ఆత్మ ననేకంగా దర్శిస్తున్నాము. బ్రహ్మ విద్యే ఉదయిస్తే అనాత్మ
Page 206