ఇక సందేహం దేనికి. అలాగే పున స్తాని కల్పాదౌ విసృజామ్యహం. మరలా సృష్టి కాలంలో నేనే వాటిని బయట పెడుతున్నా నంటున్నాడు గమనించండి. అక్కడ నా ప్రకృతిలో చేరిపోతాయని ఇక్కడ నేనే సృష్టిస్తా నంటాడు. లయమయ్యేది ప్రకృతిలో అయితే అందులో నుంచే గదా సృష్టి కావలసింది. లేక సృష్టించేది పరమాత్మ అయితే తనలోనే కదా లయం కావలసింది. సృష్టించే దొకరూ లయం చేసే దింకొకరా. చూచారా. బయటపడ్డాడు పరమాత్మ. ఆయన పడ్డాడని కాదు. దీని ద్వారా మనకొక రహస్యం బయట పెడుతున్నాడు. ఏమని. నేనూ నా ప్రకృతి ఒకటేనని. ప్రకృతి అంటే స్వభావమేగా Nature. పరమాత్మ స్వభావం పరమాత్మ గాక ఎవరు.
అదే ఇప్పుడింకా స్పష్టంగా మనకు బయట పెడుతున్నాడు. ప్రకృతిం స్వా మవష్ట భ్య విసృజామి పునః పునః భూతగ్రామ మిమం కృత్స్నమని. నా ప్రకృతే అది. దాన్ని నేనే నావశంలో ఉంచుకొని ఈ నాటకమంతా ఆడుతున్నాను. సమస్త భూతాలనూ ఇలా మాటిమాటికీ సృష్టిస్తుంటాను సంహరిస్తుంటా నంటాడు. ప్రకృతా నీవా అనే ప్రశ్నే లేదు. నా ప్రకృతి చేస్తున్నదంటే దాని ద్వారా నేను చేస్తున్నా ననే అర్ధం. ప్రకృతి నా శక్తే గనుక నా శక్తితో నేనే చేస్తున్నా ననుకోమంటా డాయన. ఒక సముద్రం తరంగ బుద్బుదాదులను సృష్టిస్తున్నదంటే అది సముద్రమా దాని శక్తా అని అడుగుతావా. సముద్రమే దానిశక్తితో అలా కనిపిస్తున్న దంటావా లేదా. అలాగే పరమాత్మే తన శక్తితో ఈ వ్యక్తమైన ప్రపంచంగా
Page 205