#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

  ప్రస్తుత మలాటి సందేహాలకు వేటికీ ఆ స్పదం లేకుండా నిష్కర్ష చేసి చెబుతున్నదీ శ్లోక ద్వయం. ఇక్కడ బ్రహ్మ దేవుడని ఒక పెద్దమనిషిని మధ్యలో తెచ్చి పెట్టటం లేదు. అసలా మనిషి ప్రస్తావనే లేదు. ఇక్కడ వర్ణిస్తున్న పాత్రలు రెండే. ఒకటి పరమాత్మ. రెండు ఆయన మాయా శక్తి. శక్తి శక్తి మతో రభేదః అని ఇంతకు ముందే పేర్కొన్నాము. శక్తి శక్తిమంతులు రెండూ ఒకటే. తేడా లేదు. కాగా ఈ మాయా శక్తికే ప్రకృతి అని మరొక పేరు. ఇది సాంఖ్యుల ప్రకృతి లాగా స్వతంత్ర కాదు. పరమాత్మతో అవి నా భూతం. అసలు పరమాత్మ స్వరూపమే. సచ్చిత్తులే గదా పరమాత్మ అంటే. చిద్రూపంగా నిమిత్త కారణం. సద్రూపంగా ఉపాదాన కారణ మాయన ఈ అనాత్మ ప్రపంచానికి. అందులో నిమిత్తంగా ఆయనను పరమాత్మ అన్నారు. ఉపాదానంగా ఆయనగారినే ప్రకృతి అన్నారు వేదాంతులు. అభిన్న నిమిత్తో పాదాన కారణమని వారు పెట్టిన పేరాయనకు. ప్రకృతి అంటే ప్రకర్షేణ కరోతి. ఒకే తత్త్వాన్ని అనేక రూపాలుగా చేసి చూపేదని శబ్దార్ధం.

  ఇప్పుడీ వెలుగులో ఈ శ్లోకాలను విమర్శించి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది విషయం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే. సమస్త భూతాలూ ప్రళయ కాలంలో నా ప్రకృతిలోనే లీనమయి పోతున్నా యంటాడు పరమాత్మ. పరమాత్మ లోనా ప్రకృతిలోనా లయ మయ్యేది. ప్రశ్నే లేదు. ప్రకృతిలో అయినా అది పరమాత్మలోనే ఉపాదాన రూపంగా material cause పరమాత్మ ప్రకృతే నని గదా చెప్పాము.

Page 204

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు