అయితే ఎందుకింత అపురూప మయింది భగవత్తత్త్వం. నిజంగా అది దుర్లభమా - లేక సులభమైనా లోకులది అర్ధం చేసుకోలేక దుర్లభమయి పోయిందా అని ప్రశ్న. దీనికిప్పు డద్భుతమైన సమాధాన మిస్తున్నదీ శ్లోక ద్వయం. అసలు లోకులేమిటి శాస్త్రజ్ఞులేమిటి కర్మిష్ఠులేమిటి ఉపాసకులేమిటి. అందరూ ఒక పెద్ద పొరబాటు చేస్తున్నారు. భేదదృష్టితో చూస్తున్నారు పరమాత్మను. ప్రపంచానికి దూరంగా ఎక్కడో ఉన్నారని భావిస్తున్నారు. మనమంతా జీవులమూ ఆయన దేవుడూ - మనకంటే ఆయన అన్నివిధాలా పరిశుద్దుడూ పరిపూర్ణుడని జీవుడికి వేరుగా భావిస్తున్నారు. అందుకే అసలైన భగవత్తత్త్వాన్ని గుర్తించలేక పోతున్నారు. దానికి మారుగా నకిలీ దేవుణ్ణి పట్టుకొని ఊరేగుతున్నారు.
అసలైన తత్త్వం ప్రపంచానికి దూరంగా ఎక్కడో లేదు. జీవులకు వేరుగా ఎక్కడో లేదు. జీవ జగత్తుల కతీతంగా ఎలా ఉందనుకొంటున్నారో జీవ జగత్తుల రూపంలో ఉన్నది కూడా అదే. యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ - ఇక్కడ ఏదున్నదో అక్కడా అదే ఉన్నదక్కడ ఏదున్నదో ఇక్కడా అదే ఉన్నదని ఉపనిషత్తు చాటుతున్నది లోకానికి. రెండింటినీ కలుపుకొని చూచినప్పుడే అది సమగ్రమైన భగవత్స్వ రూపం.
అదే వర్ణిస్తున్న దిప్పుడు గీత - భూమి రా పోనలో వాయుఃఖమ్ పృధివ్య స్తేజో వాయ్వకాశాలు. బాహ్యమైన పంచభూతాలివి. పోతే మనోబుద్ధి రేవచ అహంకారః ఆంతరమైన మనోబుద్ధ్యహంకారాలు. అవి అయిదూ ఇవి మూడూ కలిసి అష్టమూర్తులు. ఈ ఎనిమిదింటిలో
Page 21