#


Index


జ్ఞాన విజ్ఞాన యోగము

యత్నించేవాడు. అందులో కూడా అది ఎక్కడ చేస్తున్నాడో ఆ ప్రయత్నం. అసలైన మార్గంలోనే చేస్తున్నాడా లేదా అని అనుమానించ వలసి వస్తున్నది. తాను భావిస్తున్నది తత్త్వమని చూస్తున్నాడా - తత్త్వమనేది తనకు తోచినట్టు భావిస్తున్నాడా - చెప్పలేము. ఈ రెండింటిలో మొదటి భూమికలో చేరుతారు పామరులైన లోకులూ - నాస్తికులూ - హేతువాదులూ. పోతే రెండవదానిలో చేరుతారు సాంఖ్యులూ బౌద్ధులూ యోగులూ ఉపాసకులూ కర్మిష్ఠులూ వగైరా అంతా. ఒకరికి దారే తెలియదు. మరొకరు తమకు తెలిసినదే దారి అనుకొన్నవారు. ఇద్దరూ సరియైన దారిలో లేనివారే. పోతే వీరిద్దరే గాక మూడవవారున్నారే వారే మార్గంలో ఉన్నవారు. అసలైన భగవత్తత్త్వమేదో దాన్నే పట్టుకోటానికి యత్నించేవారు. వీరికే జిజ్ఞాసువులనీ ముముక్షువులనీ పేరు. వీరే నూటికి నూరుపాళ్లూ సాధకులూ సిద్ధులూ. కారణం మాం వేత్తి తత్త్వతః నన్ను ఉన్నదున్నట్టు ఆకళించుకొన్నవారు వీరొక్కరే. కనుక తత్త్వజ్ఞానమంటే సామాన్యం గాదు. మనమనుకొన్నంత సులభం కాదు. కర్మయోగ భక్తి ఉపాసనాదులతో పట్టుకొనేది కాదు. సమస్తమూ పరమాత్మ స్వరూపమేననే జ్ఞానమొక్కటే దానికి మార్గం. అది ఏ ఒక్కడికో అపురూపంగా అలవడే దృష్టి.

భూమి రాపో నలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ
అహంకార ఇతీయం మే - భిన్నా ప్రకృతి రష్టధా - 4

అపరేయ మితస్త్వన్యాం - ప్రకృతిం విద్ధిమే పరాం
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ -5

Page 20

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు