#


Index


జ్ఞాన విజ్ఞాన యోగము

ఏమంటే సిద్ధా ఏవహి తేయే మోక్షాయ యతంతే. అదీ ఇదీ లక్ష్యంగా పెట్టుకోకుండా పరమ పురుషార్ధమైన మోక్షాన్నే గమ్యంగా పెట్టుకొని సాధన చేస్తుంటారు కాబట్టి మిగతా ఉపాసకులూ యోగులకంటే వీరిని సిద్ధులనే భావించవచ్చు నంటారాయన. అంతేగాని అప్పుడే మోక్షమనే సిద్ధి పొందారని గాదు.

  అలా మోక్షఫలం రుచి చూడాలంటే ఈ సిద్ధులను కొన్న సాధకులలో కూడా అందరికీ ఉండదా అర్హత. క్షుద్రమైన శక్తుల కోసం మహిమల కోసం ప్రాకులాడే వారుంటారు. అణి మాద్యష్ట సిద్ధుల కోసం తాపత్రయ పడే వారుంటారు. వారూ సిద్ధులే. అలాంటి వారికి సిద్ధే గాని మహాసిద్ధి లేదు. మహాసిద్ధి మోక్షం. అది తత్త్వ జ్ఞానికి గాని రాదు. కశ్చిన్మాం వేత్తి తత్త్వతః నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను పట్టుకొన్న వాడెవడో ఉంటా డొకడు. అందరూ గాదు. దీన్నిబట్టి అర్థమయిం దేమిటి మనకు. మిగతా సాధనలేవీ సాధనలు గావు. జ్ఞాన సాధన ఒకటే సాధన. అది కూడా భగవత్తత్త్వ మెలా ఉందో అలా పట్టుకొంటేనే సాధన అనిపించు కొంటుంది. అది ఒకలా ఉంటే వీడు దాన్ని మరోలా పట్టుకొంటే కాదు. అది ఏ భక్తో యోగమో ఉపాసనో అయితే కావచ్చు కాని జ్ఞానం మాత్రం కానేరదు - అని నిర్మొగమోటంగా తేల్చి పారేసింది గీత.

  దీనిని బట్టి తత్త్వ జ్ఞాన మనేది ఎంత దుర్లభమో మనకు తేటపడుతున్నది. నూటికి కోటికెవడో ఒకడుంటాడు అందుకోస మసలు

Page 19

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు