జగదీశ్వరులను ఆత్మ స్వరూపంగా చూస్తేనే అది సత్యం. దానికి భిన్నంగా చూచావంటే అది సత్యం కాదు. వాచారంభణం వికారో నామధేయం. కేవలమక్కడ ఏదో ఒక పదార్ధ మున్నదని భ్రమపడు తున్నావే గాని నిజంలో అది ఎక్కడా లేదు. ఉందనే మాట మాత్రమే. ఉన్న బ్రహ్మమే మరో రూపంలో కనిపిస్తున్నది నీకు. అది కేవలం దాని వికారం. వికారంగా కూడా లేదది. అదీ నామధేయం. నామమాత్రమేనని ఘంటాపధంగా చాటుతున్న దుపనిషత్తు.
మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే
యతతా మపి సిద్ధానాం - కశ్చి న్మాం వేత్తి తత్త్వతః - 3
అయితే ఉపనిషత్తులు చాటవచ్చు. భగవద్గీతలు చాటవచ్చు. అలాటి ఏకాత్మ భావమే సత్యమూ కావచ్చు. కాని ఆ సత్యాన్ని మానవుడు గుర్తించాలి గదా. గుర్తించకనే పోతే అనుభవమనే ప్రసక్తి ఏముంది. జ్ఞానమూ దుర్లభమే. విజ్ఞానమంతకన్నా దుర్లభమే. మనుష్యాణాం సహస్రేషు వేలకొలది మానవులలో కశ్చిద్యతతి సిద్ధయే. ఎవడో ఒకడుంటాడు. పుణ్యాత్ముడు. ఎవడు వాడు. యతతి సిద్ధయే. సిద్ధి కోసం ప్రయత్నించే వాడు. సిద్ధి అంటే మోక్షం. మోక్షం కోసం ప్రయత్నించేవాడే. సిద్ధి కోసం ప్రయత్నించే సాధకుడేగాని సిద్ధుడు కాలేదు వాడింకా. పోతే యత తా మపి సిద్ధానాం. ప్రయత్నించే సాధకులలో కూడా అందరూ సిద్ధులు కాలేరు. ఎవడో నూటికి కోటికొక డుంటాడు అసలైన సిద్ధుడు. మరి సాధకులన కుండా వాళ్లను కూడా సిద్ధులే నంటుందేమిటి భగవద్గీత. దీనికి గురువుగారిచ్చే వివరణ
Page 18