#


Index


జ్ఞాన విజ్ఞాన యోగము

నేనూ నాకు గోచరించే సమస్తమూ నని అర్థం. వందలో ఒకటి నేననుకొంటే మిగతా తొంభయి తొమ్మిదీ నాకు గోచరించేదే. అది జగత్తైనా కావచ్చు. తోడి జీవులైనా కావచ్చు. ఎక్కడో ఉన్నాడని భావించే ఒక ఈశ్వరుడైనా కావచ్చు. ఇవి మూడే మానవుడు తన బుద్ధితో ఊహించ గలిగేవి. ఇవి మూడూ అనాత్మ క్రిందికి వస్తాయి.

  పోతే ఇప్పుడు గీతోపదేశ మేమిటంటే మనకు అనాత్మ అనుకొంటున్న ఇవి మూడూ కూడా వాస్తవంలో ఆత్మే. ఆత్మే మన అజ్ఞానవశాత్తూ జీవజగదీశ్వరులనే మూడు రూపాలుగా విభక్తమయి అనాత్మ అనే పేరుతో ఇలా భాసిస్తున్నది. జ్ఞానదృష్టితో చూస్తే ఇవి కేవల మాత్మ తాలూకు విభూతే గాని అనాత్మ అంటూ వేరే ఒక పదార్ధమేదీ లేదని అనుభవానికి వస్తుంది. అలా వచ్చినప్పుడిక నూటికి నూరూ ఆత్మే. అనాత్మ అనేది రజ్జు సర్పంలాగా ఆభాస అయి తేలిపోతుంది. మరి ఇలాటి జ్ఞాన మలవడి నప్పుడిక జ్ఞాతవ్య మంటూ ఏమి మిగిలిపోయింది. అంతా జ్ఞాతమే గదా. అందుకే జ్ఞాతవ్యం నావశిష్యతే అంటున్నాడు వ్యాసభగవానుడు. అయితే ఎటువచ్చీ సిద్ధాంత దృష్టాంతాలు రెండూ గట్టి పడాలి మానవుడికి. అవే జ్ఞాన విజ్ఞానాలంటే. మత్తత్త్వజ్ఞో య స్స సర్వజ్ఞో భవతి అని వ్రాస్తున్నారు భాష్యకారులు. భగవత్తత్త్వ మొకటి పట్టుకొంటే చాలు వాడు సర్వుజ్ఞుడు. సర్వమూ పట్టుకొన్నట్టే వాడంటారు. కారణ మొక్కటే. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇదం సర్వం యదయ మాత్మా. ఇదంతా బ్రహ్మమే. ఇదంతా ఆత్మ స్వరూపమే నంటున్నది ఉపనిషత్తు. జీవ

Page 17

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు