లక్షణముందో అది బ్రహ్మం. అలాగే జ్ఞానమంటే స్ఫురణ. ఉన్నాననే స్ఫురణ ఉండాలి దానికి. అంతేకాదు. అనంతం కూడా కావాలది. దాని కంతమంటూ ఉండగూడదు. విజాతీయమైన భావం మనసుకు వచ్చిందంటే దానికది అంతం. అక్కడికది తెగిపోతుందని అర్ధం. అప్పటి కనంతం కావాలంటే ఈశ్వరుడికి భిన్నంగా ఏదీ ఉండరాదు. భిన్నమైనదేది ఈశ్వరుడికి. దేశకాల వస్తువులు.
ఇదుగో వాటిని ఈశ్వర తత్త్వానికి అన్యంగా చూస్తున్నంత వరకూ అవి దానికంత మవుతాయి. ఈశ్వరు డక్కడి కంత మవుతాడు. అలా కాక అనంతం కావాలంటే అది కూడా ఈశ్వరరూపంగా దర్శించాలి. ఇదుగో ఈ దర్శనమే విజ్ఞానం. ఇలాటి విజ్ఞానం లేకుండా కేవల మా ఈశ్వరుడిలాటి వాడలాటి వాడని నీకు పరోక్షంగా భావిస్తున్నంత వరకూ అది జ్ఞానం మాత్రమే. విజ్ఞానం కాదు. అలా నీకు దూరంగా పరోక్షంగా కాక నీవేనని నీ స్వరూపంగానే ఆ ఈశ్వరుణ్ణి భావించగలిగితే అప్పుడది కేవల జ్ఞానమే గాక ఆ జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది. విజ్ఞానంగా మారిన మరుక్షణ మది సమగ్రం పరిపూర్ణం. పరిపూర్ణమైతే అసంశయం కూడా.
అంతేకాదు. యద్ జ్ఞాత్వా - అది అందుకోవాలే గాని నేహ భూయో న్యత్ జ్ఞాత వ్య మవ శిష్యతే. ఇక తెలుసుకోవలసిన పదార్ధమంటూ ఏదీ మిగలదీ సృష్టిలో. తెలుసుకో వలసిందే జ్ఞాతవ్యమంటే. అంతా జ్ఞాతమే అయినప్పుడిక జ్ఞాతవ్య to be known మేముంటుంది. ఎందుకని. జ్ఞాతవ్య మనేది రెండే రెండు విధాలు. ఒకటి ఆత్మ. మరొకటి అనాత్మ. Sub & Obj.
Page 16