చేసి పోగొట్టుకోటం. అప్పుడా భగవత్తత్త్వం సమగ్రంగా దర్శనమిస్తుంది. ఆత్మా అనాత్మ అనే తేడా రాదు. రాకుంటే ఇక ఎలాటి సంశయానికీ ఆస్కారం లేదు. అసంశయంగా సమగ్రంగా పట్టుకొన్న వాళ్ళ మవుతాము.
జ్ఞానం తేహం సవిజ్ఞాన మిదం వక్ష్యా మ్యశేషతః
యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాత వ్య మవశిష్యతే - 2
పోతే అలాటి అఖండమైన జ్ఞానం నీకు వక్ష్యామ్య శేషతః - నిశ్శేషంగా చెబుతాను వినమంటాడు పరమాత్మ. మిగులు లేకుండా పోతే అది అశేషం. మిగులేమిటి జ్ఞానానికి. జ్ఞేయం. అంటే తెలుసుకోవలసిన విషయం. తెలుసుకో వలసినదంతా ఏకరువు పెడితే ఇంకా తెలియవలసిన దేముంటుంది. ఉండటానికి వీలులేదు. అయితే అలా ఎప్పుడు జరుగుతుంది. ఏమిటి కండిషన్. జ్ఞానం సవిజ్ఞానం. విజ్ఞానంతో సహా జ్ఞానాన్ని అందివ్వాలి. అదీ షరతు. కేవల జ్ఞానమే అయితే అది సశేషమే. అశేషం కాదు. జ్ఞానమేమిటి. విజ్ఞానమేమిటి. ఏమిటి రెంటికీ తేడా. శాస్త్రజన్యమైనది జ్ఞానం. అది అనుభవానికి వస్తే విజ్ఞానం. మొదటిది సిద్ధాంతం Theoritical రెండవది దృష్టాంతం Practical. అది పరోక్షం. Indirect or mediate. 2໖ ໑ Direct or Immediate.
వీటికే జ్ఞాన విజ్ఞానాలని పేరు పెట్టింది గీత. అసలీ అధ్యాయానికి పేరు కూడా అదే. జ్ఞాన విజ్ఞాన యోగమిది. ఈశ్వరుణ్ణి గురించిన జ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదు. సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ అని వర్ణించారా తత్త్వాన్ని. సత్యమంటే ఉండటమని అర్థం. సర్వపదార్ధాలలో ఏ ఉండటమనే
Page 15