#


Index

భంగిమలలో మనకు భాసిస్తున్నది. ఒకే సువర్ణం కటక కుండల కేయూరాది రూపాలలో భాసించినట్టు. అలా భాసించినంత మాత్రాన అవి సువర్ణం కాకపోవు. దానికి వేరుగావు. అంతా కలిసి సువర్ణమే. అప్పుడది సువర్ణం తాలూకు సమగ్రరూపం. అలాగే ఈశ్వర చైతన్యమే దేశకాల వస్తువులనే నానారూపాలుగా భాసిస్తున్నదని అర్ధం చేసుకొంటే అంతా కలిసి ఈశ్వరుడి తాలూకు సమగ్ర స్వరూపంగా మన అనుభవానికి వస్తుంది. అప్పుడే సంశయ నివృత్తి.

  ఈ రహస్యాన్నే భగవత్పాదులిలా వర్ణించి చెబుతున్నారు మనకు. సమగ్రం సమస్తం విభూతి బల శక్ష్యైశ్వర్యాది గుణసంపన్నం మాం సంశయ మంతరేణ ఏవమేవ భగవానితి. సమగ్రమంటే అన్ని గుణాలు కలుపుకొన్న భగవత్తత్త్వం. బలశక్ష్యైశ్వర్యాదులతో సర్వత్రా విస్తరించి ఉన్నదేదో అది. అలాంటిదే తత్త్వమని పట్టుకొంటేనే అది నిస్సంశయమైన జ్ఞాన మంటాడాయన. యేన విజ్ఞాతేన సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఉపనిషద్వాణి. ఆత్మను గుర్తిస్తే చాలు అన్నీ గుర్తించినట్టే నట. ఏమి కారణం. అనాత్మ అని ఏది చూస్తున్నావో అది కూడా అసలు ఆత్మ స్వరూపమే. ఆత్మ అనాత్మ లాగా కూడా భాసిస్తున్నది. అద్దంలో మన ముఖమే ప్రతిముఖంగా కనిపిస్తుందనుకోండి. అంతమాత్రాన అది మనకన్యమా. రెండు ముఖాలున్నాయా మనకు. అలాగే ఆత్మ అనాత్మ రెండున్నాయను కోటం మన భ్రాంతి. అలా భావించటమే అశుద్ధి ఈశ్వరుడికి. అది కేవల మాయన విభూతేనని స్వరూపంగా దాన్ని ఆకళించుకోటమే దాన్ని శోధన

Page 14

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు