#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

అయిపోవాలి. తనకు అన్యంగా ఉండగూడదవి. అలా తనకు భిన్నంగా ఏదీ లేదన్నప్పుడే సమగ్రమది. అలా కాలే దనుకోండి. అప్పుడెక్కడ ఉండాలా ఈశ్వరుడు. ఎక్కడో ఒకచోట వైకుంఠంలోనో. ఏదో ఒక కాలంలో కృత త్రేతా ద్వాపరాలలోనో. ఏదో ఒక రామకృష్ణాది ఉపాధులలోనో. ఆ మేరకే పరిమితమయి పోవలసి వస్తుంది. అదే గదా ఇప్పుడు లోకులందరూ మామూలుగా ఊహిస్తున్న ఈశ్వరుడు. ఇదుగో ఇదే ఆ భగవత్తత్త్వానికి పట్టిన మాలిన్యం. దేశకాల వస్తువుల మేరకా తత్త్వాన్ని భావించటమే అసలైన మాలిన్యం. మన బుద్ధు లారోపించినదే అది. ఆరోపించి చూస్తున్నంత వరకూ అది సమగ్రం కాదు. సమగ్రం కాకుంటే మనకు సంశయం వదలిపోదు. ఎందుకంటే అంతే నా అంతవరకేనా ఆ ఈశ్వరుడు. మిగతా ప్రపంచ మీశ్వరుడు కాడా. కాకుంటే అది సమగ్రమెలా అయిందని ఇలా మనసు పరిపరి విధాల పోతుంటుంది. పోతే అది సంశయం కాక నిశ్చయమెలా అవుతుంది.

  సంశయం పోయి నిశ్చయమే ఏర్పాడాలంటే దేశకాలాదికమైన అన్య భావన ఏదీ రాకూడదు మనస్సుకు. భగవత్తత్త్వాని కేదిగాని వేరుగా చూడగూడదు. అదే తత్పదార్థ శోధన. శోధన చేయనంత వరకూ సమగ్రం కాదది. సమగ్రం కానంత వరకూ సంశయం పోదు మనకు. కనుక కేవలమాత్మ స్వరూపంగానే గాక అనాత్మ ప్రపంచంగా కూడా పరమాత్మే విస్తరించి ఉన్నాడని భావించాలి సాధకుడు. చైతన్య మాయన స్వరూపమైతే ప్రపంచమంతా ఆయన విభూతి. విస్తారం. చైతన్యమే విస్తరించి ఇన్ని

Page 13

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు