యోగమైశ్వరం. ఇదంతా ఏదో గాదు. నా మాయాశక్తి ప్రభావ మంటున్నాడు పరమాత్మ. ఉన్నదా ఏకైకమైన ఆత్మే అయినా దానికొక శక్తి కూడా ఉందది మరచిపోరాదు మనం. అది మనదగ్గర విద్యగా పని చేస్తుంటుంది. అవిద్యా దృష్టితో మనం చూస్తే ఆ ఏకమైన ఆత్మే జీవజగదీశ్వరులనే అనాత్మగా దర్శన మిస్తుంటుంది. మనమే మరలా విచారణ చేసి చూస్తే అది విద్యా దృష్టి కాబట్టి అనాత్మ మాసిపోయి మరలా ఏకైకమైన ఆత్మగానే దర్శన మిస్తుంది. పరమాత్మ కెప్పుడూ అది విద్యా స్వరూపమే కాబట్టి భూతభృత్ నచభూతస్థః ఈ సమస్త భూతాలనూ తనలో ఉన్నట్టు చూపుతుంటాడు మనకు. కాని తాను మాత్రం వాటిలో ఉన్నానని భావించడు. లేకుండానే మరి ఎలా చూప గలుగుతున్నా డంటే ఒక ఐంద్రజాలికుడు చూపినట్టు చూపుతున్నాడు తన విద్యాబలంతో నని జవాబు. అదే వివరిస్తున్నా డిప్పుడు మమాత్మా భూతభావనః అని. ఏమిటర్ధం. నా స్వరూపంలోనే ఉన్నదొక మహాశక్తి. అది చరాచర భూతా లసలు నాకు భిన్నంగా ఏవీ లేకున్నా ఉన్నట్టు సృష్టించ గలదు. మీకు ప్రదర్శించ గలదు. అవిద్యా దృష్టితో చూచేవాడి కవి వాస్తవంగా ఉన్నట్టు కనిపిస్తాయి. నాలాగే మీరూ విద్యా దృష్టితో చూస్తే అవేవీ కనిపించవు. వాటి స్థానంలో నా స్వరూపమే మీ స్వరూపంగా మీ అనుభవానికి వస్తుందని చాటి చెబుతున్నాడు. ఇదీ పిండితార్ధం.
యథాకాశ స్థితో నిత్యం- వాయు స్సర్వత్ర గో మహాన్
తథా సర్వాణి భూతాని - మఱ్ఱానీ త్యుపధారయ - 6
Page 200