దానిలో అదే ఉందని చెప్పాలి. దానిలో అదేమిటి. అదీ తప్పే. మరేమని చెప్పాలి. దానిపాటికది ఒక్కటే ఉందని చెప్పాలి. అదీ అసలైన మాట.
కాని అలా చూడటం లేదు మనమిప్పుడు. ఆత్మా అనాత్మా అని
రెండు భావాలు పెట్టుకొని చూస్తున్నాము. ఆత్మ ఏమిటో గుర్తించని అజ్ఞానం
వల్ల అలా భావిస్తున్నాము. ఇలాటి అపోహ క్రమంగా మనకు
వదిలించటానికి మహర్షి చేస్తున్న బోధ ఇది. అది మూడు భూమికలలో
సాగిస్తున్నా డాయన. అందులో మొదటి భూమిక పరమాత్మలో సమస్తమూ
ఉందని చెప్పటం. రెండవది పరమాత్మ మాత్రం ప్రపంచంలో లేడని
చెప్పటం. పోతే మూడవది ప్రపంచమనేది పరమాత్మలో అసలు లేనే లేదని
చాటటం. ఇవి పైకి చూస్తే పరస్పర విరుద్ధమైన భావాలుగా కనిపిస్తాయి.
కాని నిజమాలోచిస్తే విరోధమేమీ లేదు. ఒకే తత్త్వాన్ని అనేకంగా
చూస్తున్నారు లోకులు. అది అనేకం గాదు - ఏకమని చెబుతున్నది శాస్త్రం.
ఒక్కసారిగా చెబితే నీవు నమ్మవు కాబట్టి భూమికా క్రమంలో నీ దృష్టిని
అనేకత్వం నుంచి ఏకత్వం మీదికి మళ్లించే ప్రయత్నమిది. అది నీకు
మొదట్లో విరుద్ధంగా కనిపించినా చివరకు సత్యమేదో గ్రహిస్తే అవిరుద్ధంగానే
అనుభవానికి వస్తుంది. ఇదీ సంగతి.
అయితే ఇదంతా ఏమిటీ నాటకం. ఏక మేమిటి. అనేకంగా భాసించట మేమిటి. భాసించినా అది తనపాటికి తాను లేదని చెప్పటమేమిటి. లేకుంటే ఎందుకిలా కనిపిస్తుందంటే అది ఏదో గాదు మరలా ఆ ఏకైకమైన ఆత్మేనని పేర్కొనట మేమిటి. ఏమిటిదంతా. పశ్యమే
Page 199