#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

తాను స్వరూపమైతే తనదంతా విభూతి. అప్పటికి పరమాత్మే తప్ప మరే పదార్ధమూ వాస్తవంగా లేదన్న మాట.

  ఒక్కసారిగా ఈ మాటవింటే గుండె పగులుతుంది మనకు. పైగా నమ్మబుద్ధి పుట్టదు. అంచేత అంచెల వారిగా ఈ అద్వైత సత్యాన్ని నిరూపిస్తున్నాడు. మతాని సర్వభూతాని. నీ విప్పుడు స్థావర జంగమాత్మకంగా నానావిధాలుగా చూస్తున్నావే ఈ సృష్టినంతా. ఇది ఎక్కడో లేదు. ఇదంతా నాలోనే ఉంది. నా హద్దులలోనే ఉందంటాడు. నచాహం తేష్వవస్థితః - అయితే అవి నాలో ఉన్నాయే గాని నేను మాత్రం వాటిలో లేనంటాడు మళ్లీ. ఏమిటర్ధం. పరమాత్మ ప్రపంచాని కాధారమే గాని ప్రపంచ మాయన కాధారం కాదు. ఆధారం పెద్దది. ఆ ధేయం చిన్నది. ప్రపంచమాయన కాధారమంటే పరమాత్మ కంటే ప్రపంచం పెద్దదని చెప్పవలసి వస్తుంది. మరి వ్యాప్యం వ్యాపకం రెండూ పరమాత్మే నన్నారు గదా. వాటిలో కూడా తానున్నానంటే తప్పేమిటి. నిజమే. అవి తన లాగా వాస్తవమైతే ఉన్నానని చెప్పవచ్చు. వాస్తవం కాదది. ఆభాస. ఆ భాసలో వస్తు వుండదు. వస్తువులోనే ఆభాస ఉంటుంది. సముద్రంలో తరంగ ముందని చెప్పాలి గాని తరంగంలో సముద్రమని చెప్పగూడదు. తరంగంలో కూడా సముద్ర జలముంది గదా అనవచ్చు. సముద్ర జలమంతా ఒక్క తరంగంలో బుద్బుదంలో ఇమడగలదా. అంతా అందులోనే ఎలా ఇమిడిపోతే ఇక తరంగమే ఉండ దక్కడ. సముద్రమే అవుతుందది. అంచేత జీవ జగదీశ్వరులనే విశేషాలన్నీ పరమాత్మ చైతన్యంలో తలదాచుకో

Page 197

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు