మానవులిక అక్కడికి వెళ్లి వెనక్కు రావటమనే ప్రశ్నేముంది. ఒకవేళ వెళ్లి వచ్చారని చెప్పినా అది అసలైన తత్త్వాన్ని చేరిగాదు. దాని నకళ్లైన దేవతలను పట్టుకొని వారి లోకాలకు పోయి కొంతకాల మక్కడ ఉండి వెనక్కు వచ్చారని చెప్పవలసిందే. ఎలాగైనా అసలైన పరమాత్మ జ్ఞానం లేదు. మరే జ్ఞానమున్నా ఉపయోగం లేదు. మృత్యురూపమైన సంసారం వారికి తప్పదనేది ఖాయం.
మయా తత మిదం సర్వం జగ దవ్యక్త మూర్తినా
మత్తావి సర్వభూతాని - న చాహం తే ష్వవస్థితః - 4
నచ మతాని భూతాని - పశ్యమే యోగ మైశ్వరం
భూత భృన్నచ భూతస్థో - మమాత్మా భూత భావనః - 5
అయితే శ్రద్ధాభక్తులు లేక అసలైన భగవత్తత్త్వాన్ని పట్టుకోలేక పోతున్నారని గదా శాపనార్థం పెట్టారు. మరి ఆ అసలైన తత్త్వమేమిటో అది ఎలా ఉంటుందో దాన్ని ఎలా పట్టుకోవాలో చెబుతారా అని అడిగితే చెబుతున్నా డిప్పుడు భగవానుడు. వినండి. మయాతత మిదం సర్వం జగత్. ఈ వాక్య మిప్పటికి రెండు మూడు మార్లు వచ్చింది. సాంఖ్యం దగ్గరి నుంచి వింటూనే ఉన్నా మీమాట. ఇప్పుడూ వింటున్నా మికమీదట కూడా వినబోతాము మోక్ష సన్న్యాసమనే కడపటి అధ్యాయంలో కూడా. ఇలా నాలుగైదు సార్లు ఒకే వాక్యం వినవస్తున్న దంటే ఎంతో ముఖ్యమైన విషయమే అయి ఉండాలి సందేహం లేదు. ఏమిటది. దాని అర్థమేమిటో తెలుసుకొంటే తెలిసిపోతుంది అది ఎంత గొప్పదో. నేనే వ్యాపించి ఉన్నా నీ సమస్త ప్రపంచాన్నీ అని దాని అర్ధం. నేనంటే పరమాత్మ. ఆయన ఈ
Page 195