#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

దానిమీదనే నిఘా పెట్టి చూచావో తప్పకుండా అది నీకు సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్కరించక పోవటానికది అక్కడ లేకుంటే గదా. వస్తుసిద్ధంగా నీవు చూచినా చూడకున్నా ఉందది. చూడకుంటే నీబుద్ధికి సోకలేదు. చూస్తే సోకింది. అంతమాత్రమే. ఇంతకూ సద్రూపమైన బ్రహ్మ చైతన్యమెప్పుడూ ఉంది నీవు గుర్తించినా గుర్తించక పోయినా. గుర్తిస్తే నీ సొమ్మవుతుం దది. ఆ గుర్తించే ఉత్సుకత్వానికే శ్రద్ధ అని పేరు.

  అదే ఇప్పుడు కరువయి పోయింది మానవజాతికని బాధపడుతున్నాడు. భగవానుడు. శ్రద్ధ లేకపోయే సరికా జ్ఞానస్య ధర్మస్య స్వరూపే తత్ఫలేచ నాస్తికాః దేహ మాత్రాత్మ దర్శన మేవ ప్రతి పన్నాః - ఆత్మ ఒకటున్నదనే జ్ఞానమే లేక దాని వల్ల సాధించే ఫలితానికీ నోచుకోక దేహమే ఆత్మ అని అక్కడికే దిగజారి పోతున్నారు. అలాటి పిదప బుద్ధితో పట్టుకోబోతే నేనెలా పట్టుపడతానని చీవాట్లు పెడుతున్నాడు పరమాత్మ. అప్రాప్యమాం సర్వ ప్రపంచానికే ఆత్మగా నన్ను చూడక తమ దేహం వరకే ఆత్మ అనే భావంతో చూస్తే ఏమవుతుంది. నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. నిరంతరమూ జనన మరణా లనుభవిస్తూ ఈ సంసార చక్రంలోనే పరిభ్రమిస్తుంటారు. ఇక్కడే నిలిచిపోతారు. ని వర్తంతే అంటే నిశ్చయేన వర్తంతే ఇక్కడే నిలిచిపోతారని వ్యాఖ్యానించారు భగవత్పాదులు. భగవత్తత్త్వాన్ని అందుకోకపోతే ఏమవుతారు నిలిచిపోక. మత్రాప్తి మార్గభేద భక్తిమాత్ర మపి అప్రాప్య - నన్ను జ్ఞానంతో కాకపోయినా కనీసం సగుణమైన భక్తితోనైనా పట్టుకోవచ్చు గదా. దానికీ నోచుకోలేదీ పనికిమాలిన

Page 194

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు