నీవు పనులు చేస్తున్నా అక్కడ శ్వాస నడుస్తూనే ఉన్నది. అసలా ఆధారం లేకుంటే బాహ్యమైన ఈ వ్యవహారమంతా ఖాళీయే నని చెప్పాము. కాని వీటన్నింటినీ నమ్ముతావు వీటి అస్తిత్వాన్ని నమ్మలేవు. సద్విశేషాలను చూస్తుంటావు. వాటి కాధారమైన సత్సామాన్యాన్ని గుర్తించలేవు.
శ్రద్ధ లేకపోవటమే కారణ మంటున్నది గీత. శ్రద్ధ అంటే దాని మీద దృష్టి. దృష్టి పెట్టకపోతే ఎదటనే ఉన్నా దృశ్యం మనకు కనపడదు. పశ్యన్న పిచ న పశ్యతి. చూస్తుంటామే గాని చూడము మనం. అది అక్కడ లేక గాదు. మనకు దానిమీద దృష్టి లేక. అనగా శ్రద్ధ లేక observation. మానవ మనస్తత్త్వమెంతగానో మధించి వ్రాస్తున్నారీ విషయాన్ని భగవత్పాదులు. ఛాందోగ్యంలో శ్రద్ధత్స్వ అని ఒక మాట వస్తే దాన్ని సాగదీసి ఇలా వ్యాఖ్యానిస్తా రాయన. అత్యంత సూక్ష్మే ష్వర్దేసు బాహ్య విషయాసక్త మనసః స్వభావ ప్రవృత్తస్య. మనసనేది ఎప్పుడూ బాహ్యమైన నామరూపాది విశేషాల మీదికే పరుగెడు తుంటుంది. వాటిమీదనే ఆసక్తి చూపుతుంది. అది దాని స్వభావమయి కూచుంది. అలాంటప్పుడు అసత్యాం గురుతరాయాం శ్రద్ధాయాం దురవగమత్వం స్యాత్. అతి సూక్ష్మమైన వాటి ఆధారమేమిటో దాన్ని పట్టుకోవాలన్నా దానిమీదనే చూపు పెట్టుకోవాలన్నా అది అంత సులభం కాదు. ఎంతో శ్రద్ధ ఉంటే గాని అది మానవుడి మనసుకు రాదు. శ్రద్ధాయాంతు సత్యాం. అలాకాక శ్రద్ధ అనేదే నీకుంటే మాత్రం. మనసః సమాధానం బుభుత్సితే అర్థ భవేత్. నీవు గ్రహించవలసిన విషయం మీద నీకు ఏకాగ్రత ఏర్పడుతుంది. తతశ్చ తదర్ధావగతిః
Page 193