అశ్రద్ధ ధానాః పురుషా - ధర్మ స్యాస్య పరంతప
అప్రాప్యమాం నివర్తంతే - మృత్యు సంసార వర్త్మని - 3
అయినా చిత్రమేమంటే ధర్మ స్యాస్య. అది మనల నెప్పుడూ అంటిపెట్టుకొనే ఉన్నా అశ్రద్ద ధానాః పురుషాః - మనలో నూటికి తొంభయి తొమ్మిది మంది దాన్ని నమ్మలేక పోతున్నారు. అది ఒకటి ఉందనీ నమ్మకం లేదు. ఎక్కడో గాదది సర్వత్రా ఉందది ఏదో గాదు మన స్వరూపమే ననీ నమ్మకం లేదు. ఏమి కారణం. అది నిరాకారం కావటం ఒకటి. సాకారమైన ఈ చరాచర పదార్ధాలన్నీ దాన్ని కప్పి వేయట మొకటి. ఈ పదార్ధాలు మన కుపయోగ పడ్డట్టు దైనందిన జీవితంలో అది మన కేమాత్రమూ ఉపయోగపడక పోవట మొకటి. ఇన్ని ఉన్నాయి కారణాలు. కాని వాస్తవ మేమంటే నీ కుపయోగపడు తున్నాయని సంతోషిస్తున్న ఈ పదార్ధాలన్నీ దానిమీదనే ఆధారపడి ఉన్నాయి. సినిమా బొమ్మలకు తెరలాగా ప్రతిబింబా లన్నిటికీ అద్దంలాగా అదే వీటి కధిష్ఠానం Basis. అది లేకుంటే ఇవి లేవసలు. నిజంలో అదే వీటన్నింటి రూపాలలో మనకు భాసిస్తున్నది. వస్తు సిద్ధంగా అక్కడే ఉన్నా మనకు బుద్ధి సిద్ధం కావటం లేదు. తాత్కాలికంగా మన కుపయోగ పడుతున్నాయి గదా అని వీటితోనే లావాదేవీ పెట్టుకొని దాని ఊసే మరచి పోయాము మనం. సంగీతంలో శ్రుతిలయలు మరచిపోయి నాలుగైదు గంటలు కచేరీ వింటున్నట్టు వింటున్నాము. ప్రాణాపానాలు మరచిపోయి ఆయా పనులు చేస్తూ బ్రతుకుతున్నట్టు బ్రతుకుతున్నాము. కాని నీవు పాట వింటున్నా అక్కడ శ్రుతి లయ లున్నాయి.
Page 192