అది లేదనే భావం కూడా ఉన్నదనే గమనిస్తుంటావు గదా. ఇలా ప్రతి వస్తువునూ వ్యక్తినీ పరిస్థితినీ నీవు ఎలా ప్రత్యక్షంగా చూస్తున్నావు. సాకారం నిరాకారమనే తేడా ఏముంది. మరి ఆ ఉనికనేదే లేకపోతే ఆ వస్తువు నీకు కనపడుతుందా. నీవు చూడగలవా. లేదు గదా. వస్తువును చూస్తున్నా వంటేనే వస్తువుతో పాటు దాని స్థితిని కూడా చూస్తూనే ఉంటావు. ఇంకా వస్తుజాల మొక చోట ఉంటే మరొక చోట ఉండదది. ఒక కాలంలో ఉంటే మరొక కాలంలో ఉంటుందని గారంటీ లేదు. దాని స్థితి అలాకాదు. వ్యాపక మది. దేశకాలా లన్నింటినీ వ్యాపించి ఉంది. అది ప్రత్యక్షం కాలేదనే మాట అసలే చెల్లదు. ఇదుగో ఈ స్థితి అనండి ఉనికి అనండి. దీనికే సత్ అని పేరు పెట్టారు వేదాంతులు. నిరాకారం వ్యాపకం గనుక సాకారమైన వస్తువులూ వ్యక్తులూ నశించినా ఇది నశించదు. ధర్మ్యం. ధరించి ఉంటుంది. అంటి పట్టుకొని ఉంటుందని అర్ధం. పదార్ధమున్నా లేకున్నా సరే. దాని భావాన్నీ అభావాన్నీ Both presence and absence రెండింటిలోనూ కనిపిస్తుందది. కనుకనే అవ్యయ మన్నది గీత. వ్యయం లేనిదేదో అది అవ్యయం. ఖర్చు లేనిది. ఎప్పటికీ తొలగ పోనిదని అర్ధం. ఎందుకంటే అది వస్తురూపంగాదు. దాని స్థితి Not the form of existance. But the existance of the form. Form ఎప్పటికప్పుడు మారిపోవచ్చు. Substance అలా మారదు. సొమ్ముల రూపాలు పోతాయి. బంగారమలా మారిపోదు. బంగారం లాంటిది సత్. సొమ్ముల లాంటివి సద్విశేషాలైన పదార్ధాలు.
Page 190