పోగా నీ జ్ఞానంతో పెనవేసుకొని ఏకంగానే నీ కనుభవానికి వస్తుంటాయి. అలాగే అంతకన్నా ఎక్కువ సన్నిహితం బ్రహ్మమనేది నీకంటారు.
అది ఎలాగని మీ రాశ్చర్య పడనక్కర లేదు. ఆ బ్రహ్మమనేది మీరు నామరూపాత్మకమైన ఒక పదార్ధమను కొంటే నేను చెప్ప లేను గాని కేవలమది ఈ కనిపించే వస్తు జాలాన్నంతా వ్యాపించి ఉన్న ఒక స్థితి ఒక ఉనికి ఒక సత్తా Existance అని చూడగలిగితే చాలు. ఈ వస్తువు నీకెంత ప్రత్యక్ష మంటున్నావో వీటికన్నా ఎంతో ప్రత్యక్ష మది. ఇవి సాకారంగా ప్రత్యక్షమైతే అది నిరాకారంగానే ప్రత్యక్షం. సాకారమింకా ఒకచోట ఉంటే మరోచోట ఉండదు. ఒక రూపంలో ఉంటే మరో రూపంలో కనిపించదు. నీకు. నిరాకారమైన ఈ స్థితి Existance or presence of things ఒకచోటనే గాదు. ఒక రూపంలోనే గాదు. సర్వత్రా పరుచుకొని నీకు ఎదురుపడు తుంటుంది. నిరాకారమెలా కనపడుతుందని అడుగుతా వేమో. నిరాకారమైన ఆకాశ మిప్పుడు నీకూ నాకూ దర్శన మివ్వటం లేదా. కంటితోనే చూచి చెబుతా విక్కడ ఖాళీగా ఉందని. ఖాళీయే గదా ఆకాశమంటే. అది ఎక్కడ లేదు. నీవు పైకి చూస్తే ఆకాశం. క్రింద చూస్తే ఆకాశం. ప్రక్కలన చూస్తే ఆకాశం. నీ లోపలా ఆకాశమే. నీ వెలపలా ఆకాశమే. అసలు నీవున్నదీ నీవూ అంతా ఆకాశమే. అది నిరాకారమైనా సర్వత్రా చూస్తూనే ఉన్నావు నీవు.
అలాగే నీతో కలుపుకొని నీవు చూచే ఈ ప్రపంచమంతా ప్రతి ఒక్కటీ ఉన్నదని చూస్తున్నావా లేదా. ఒకవేళ అది అక్కడ లేకపోయినా
Page 189