#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

మీరది ఫలానా అని మాకు చూపగలరా అని ప్రశ్నిస్తారు లోకులు. లోకులేగాదు. చాలామంది శాస్త్రజ్ఞులకు కూడా ఇక్కడే అనుమానం. తామూ చూడలేక అడిగే లోకులకూ ఇదమితమని చూపలేక కొందరు నాస్తికులైతే కొందరు ఆస్తికులయి కూడా దానినెక్కడో తమకూ మనకూ అంతు పట్టని లోకాంతరాలలో రూపాంతరాలలో నిలిపి ఉంచి అదేమంటే అక్కడికి వెళ్లి చూస్తేగాని అది మనకు కనిపించదండీ అని బుకాయిస్తుంటారు. అల్పసంతోషులై బ్రతుకుతుంటారు. ఇదంతా బ్రహ్మమంటే ఆత్మ అంటే ఏమిటో సరియైన అవగాహన లేక. అలాటి అవగాహన చక్కగా ఉన్నవాడు దాన్ని ఎక్కడా తెచ్చిపెట్ట నక్కర లేదు. ఎక్కడబడితే అక్కడ ఉందని గ్రహించగలడు.

  అదే చెబుతున్న దిప్పుడు గీత. ప్రత్యక్షావ గమం ధర్మ్యమని. ప్రత్యక్షంగానే కనిపిస్తున్నదట ఆ బ్రహ్మం ప్రతి ఒక్కరికీ. ఎక్కడికో వెళ్లి వెతక నక్కర లేదు. ఇక్కడే ఉన్నా మరుగు పడ్డదీ గాదు. మన ఎదట ఉన్న ఇల్లూ వాకిలీ చెట్టూ చేమా ఎలా మనకళ్లకు ప్రత్యక్షంగానే కనిపిస్తున్నాయో అలాగే ప్రత్యక్షావగమం. ప్రత్యక్షంగానే అనుభవానికి వస్తున్నదట. ఎలా గయ్యా అని అడిగితే భగవత్పాదు లంటారు సుఖాదేరివ అని. ఒక సుఖమో దుఃఖమో నీ కనుభవానికి రావటం లేదా. అది నీకు ప్రత్యక్ష మంటావా పరోక్ష మంటావా. ప్రత్యక్షంగాక పోతే ఇది సుఖం. నాకిప్పుడు సుఖంగా ఉందని ఎలా చెప్పగలిగావు. ఇల్లూ వాకిలి లాంటివైనా దూరంగాని నీకు సుఖదుఃఖాద్యను భవాలు ఏమాత్రమూ దూరంగావు. దూరంగాక

Page 188

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు