అన్నది గీత. నేహ భూయోన్యత్ జ్ఞాతవ్య మవశిష్యతే. ఇక తెలుసు కోవలసింది ఏదీ మిగల లేదని. అంతే కాక మోక్ష్యసే అశుభాత్. ఇక సమస్యే లేదు అన్నీ పరిష్కార మయినట్టేనని.
ఇంతకూ ఏమిటది. బ్రహ్మజ్ఞానం బ్రహ్మానుభవం. సముద్రంలో నదులన్నీ చేరిపోయి నట్టుగా మానవుడి జ్ఞానాలన్నీ అనుభవాలన్నీ అందులో చేరిపోవలసిందే. అందుకే రాజ విద్య The king of all sciences రాజగుహ్య ລ້ the secret or art of secrets or arts. 2 2 అడిగితే పవిత్ర మీద ముత్తమ మని రెండు మాటల్లో తేల్చి పారేసింది గీత. అన్నిటికన్నా పరిశుద్ధమైనది పావనమైనది బ్రహ్మ విద్య. అనేక సహస్ర సంచిత మపి ధర్మా ధర్మాది సమూలం కర్మ క్షణమాత్రా దేవ భస్మీకరోతీ త్యతః పావనత్వ మని వ్రాస్తున్నారు భాష్యకారులు. ఎన్నివేల లక్షల జన్మల నుంచో పోగైన పుణ్యపాప కర్మలన్నింటినీ వాటికి మూలమైన అజ్ఞానంతో సహా క్షణకాలంలో భస్మీ పటలం చేస్తుంది కాబట్టి పవిత్రమైన దట. అంతే కాదు. అగ్ని జలాదులైన పవిత్ర పదార్ధాలెన్నో ఉండవచ్చు లోకంలో. అవీ మనలను శుద్ధి చేసేవే కావచ్చు. కాని అది శరీరం వరకే. ఇది అలా కాదు. సంచిత కర్మ వాసనలను కూడా నిర్మూలిస్తుంది. కాబట్టి వాటికన్నా ఎన్నోరెట్లు ఉత్తమం కూడా నంటా రాయన.
పోతే ఇలాటి బ్రహ్మ విద్య అది ఎంత గొప్పదైనా కావచ్చు. కాని మీరు చెప్పే ఆ బ్రహ్మ మెక్కడ ఉందని. గురువుగారి మర చెంబులాగా మీరెంత వర్ణించినా ఎక్కడో ఒకచోట ఉండాలిగా అది. ఉందని నమ్మకమేనా.
Page 187