#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

సచ్చిద్రూపమే ప్రపంచానికి స్వాభావికం. నామరూపాదులే కృత్రిమం. అలాంటప్పుడు సచ్చిద్రూపంగా దాన్ని చూడాలేగాని - చూస్తే ఎందుకు కనిపించదు. కృత్రిమమే కనిపించినప్పుడు సహజంగా కనిపించటంలో ఆశ్చర్యమేముంది. అయినా నామరూపాలు కనిపించవా అంటే కనిపిస్తాయి. కాని వాస్తవమని చూడడు జ్ఞాని. ఆభాసగా దర్శిస్తాడు. ఒక ఇంద్రజాల మొక నాటక మీ ప్రపంచం వాడి దృష్టికి. చూస్తున్నా ఆసత్యమేననే చూపుంటుంది జ్ఞానికి. అదైనా శరీరమనే ఉపాధి ఉంది కాబట్టి. శరీర మున్నంతవరకూ ఆ భాసగా చూచి శరీర పాతమైతే వాడిక నిత్యముక్తుడైన పరమాత్మే కాబట్టి దాన్ని తనకు నిత్యానపాయిని అయిన శక్తిగా మార్చుకొంటాడు. జీవన్ముక్తిలో వాడికీ ప్రపంచ మాభాస. విదేహ ముక్తిలో మాయాశక్తి. అంతేగాని జ్ఞాని దృష్టిలో ఇది ఎప్పుడూ ప్రపంచం కాదు. ఆ స్తా మే త దేవం. ప్రకృత మను సరామః

రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మీద ముత్తమం
ప్రత్యక్షావ గమం ధర్మ్యమ్ - సుసుఖం కర్తుమవ్యయమ్ - 2


  జ్ఞానం విజ్ఞానం - విద్యా గుహ్యం - సిద్ధాంతం దృష్టాంతం శాస్త్రం కళ - జ్ఞాన మనుభవం- భావికం భౌతికం - మానసికం దైనందిన జీవితం - ఇవన్నీ జంట పదాలు. ఈ జంట లన్నింటికీ అర్థ మొక్కటే. ఒకటి మనం సంపాదించే జ్ఞానం Science. మరొకటి ఆ జ్ఞానాన్ని జీవితంలో అమలు పరచటం Art. ఇంతకుమించి మన మాసించే పురుషార్ధ మంటూ ఏదీ లేదు. ఇదే పరిపూర్ణత completion జీవితానికి. అందుకే

Page 186

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు