దాని స్థాయి కెదిగి చూడలేని వారే. అలా చూడలేక పోయే సరికి దానిలో లేని దోషాలు వెతికి అద్వైత దర్శన మనేది అసలు దర్శనమే గాదు పొమ్మని దాన్ని దూషిస్తూ వచ్చారు. సత్యానికి వేయామడల దూరమయి పోయారు. ఇలాటి అసూయా బుద్ధి ఉన్నంత వరకూ ఏ మానవుడికీ ఈ అద్వైత బ్రహ్మజ్ఞాన మలవడదు. వాడికి బోధించినా ప్రయోజనం లేదు. అర్ధం చేసుకోకపోగా పెడర్థాలు తీస్తాడు. కనుకనే అనసూయవే తే. నీ క సూయ లేకుంటేనే బోధిస్తానంటాడు పరమాత్మ.
అయితే ఏమిటా బోధ ఇంతకూ. జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞానమంటే సర్వమూ ఆత్మస్వరూపమే. జీవ జగదీశ్వరుల నే త్రి పుటి ఏమాత్రమూ దాని కన్యంగా లేదనే సత్యం. అలాటి సత్యాన్ని పరోక్షంగా గాక అపరోక్షంగా స్వానుభవానికి తెచ్చుకో గలిగితే అది విజ్ఞానం. ఇలాటి విజ్ఞానంతో సహా జ్ఞానాన్ని అందుకొ న్నప్పుడే యద్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్తని హామీ ఇస్తున్నది గీత. అశుభ మంటే సంసారం. అనిత్యమ సుఖం లోకం దుఃఖాలయ మశాశ్వతమని స్టాంపు వేసింది దీనికి గీత. అంతే గాదు. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోష దూషితమని కూడా చాటుతున్నది. అశుభంగాక మనకిది శుభమెలా అవుతుంది. ఇలాటి అశుభకరమైన సంసార తాపం నుంచి మోక్ష్యసే. నీకు మోక్షం లభిస్తుందని ఇచ్చే హామీ కంటే గొప్ప హామీ ఏమి ఉంది. అలా బయట పడాలంటే మాత్రం యద్ జ్ఞాత్వా. అసలైన బ్రహ్మాత్మ జ్ఞానం సంపాదిస్తేనే సుమా అని షరతు పెడుతున్నది గీత.
Page 183