#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

  అలాంటి జ్ఞానం నీకు ప్రవక్ష్యామి. బోధిస్తాను వినమంటున్నాడు. మరి ఎవరూ మనకు భిన్నంగా లేరుగదా. నీకు నేను బోధిస్తాననే మాట కర్ధమేమిటి. నిజమే. బోధించే టప్పుడది ద్వైతమైనా బోధనందుకొని స్వానుభవానికి తెచ్చుకొనే టప్పుడది అద్వైతంగా అనుభవానికి వస్తుంది. మరలా వాడొకరికి చెప్పేటప్పుడు ద్వైత రూపంగా బయటపడుతుంది. బోధలో ద్వైతం. గ్రహించటంలో అనుభవంలో అద్వైతం. అలా కాకుంటే గురుశిష్య సంప్రదాయమనే మాట కర్ధం లేకుండా పోతుంది. Analysis while explaining synthesis while experiencing. వలసిన రహస్యం.

  అయితే బోధించే అవకాశముంది గదా అని ఎవరికంటే వారికి చేయగూడదా బోధ. అందులోనూ గుహ్యతమ మంటున్నది గీత. అంత గొప్ప రహస్య మొకవేళ బయటపెట్టినా గ్రహించ గలిగి ఉండాలి గదా ఎదుటి వ్యక్తి. వాడికలాటి యోగ్యత ఉండాలి. ఏమిటది. అనసూయవే. అసూయ ఏమాత్రమూ ఉండగూడదు గ్రహించే శిష్యుడికి. అసూయ అంటే మన మనుకొనేది గాదు. గుణేషు దోషా రోపణ మసూయా అన్నారు. అక్కడ గుణముంటే దాన్ని చూడలేక దోషంగా భావించటమే అసూయ Bias . సర్వమూ ఆత్మ స్వరూపమనేది సత్యమైనా దాన్ని అందుకొనే సామర్ధ్యం లేదు నూటికి తొంభయి మందికి. అందుకే గదా నాస్తికులూ హేతువాదులూ తయారయ్యారు లోకంలో. భేదవాదులైన మతాచార్యులు కూడా అలాంటివారే. చార్వాకుల దగ్గరి నుంచి పాతంజల యోగుల వరకూ

Page 182

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు