#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

గూర్చి శ్రవణ మనన నిదిధ్యాసనలు చేసి తరించవలసిందే ననే సత్యం విస్మరించ రాదు. ఇదీ విషయం. పోతే ఇప్పుడు భగవానుడేమి బోధిస్తాడో విందాం.

ఇదంతు తే గుహ్య తమం - ప్రవక్ష్యా మ్యనసూయవే
జ్ఞానం విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే 22 శుభాత్ - 1


  ఇదం తు తే గుహ్యతమం. తు అనే మాట పక్ష వ్యావర్తనార్ధం విశేషణార్ధమని వ్రాస్తుంటా రెప్పుడూ భాష్యకారులు. మిగతావాటి కన్నా ఇది విశిష్టమని వాటిలో నుంచి దీన్ని వేరు చేసి చూపే సందర్భంలో వాడు తారట తు అనేమాట. ఇప్పుడిక్కడ ఇదంతు అన్నారంటే ఇది మిగతా వాటి లాంటిది కాదు అన్నిటికన్నా అత్యుత్తమ మని చెప్పట ముద్దేశం. ఏమిటది. రాజవిద్య. అంటే బ్రహ్మ జ్ఞానమని అర్ధం. అది కర్మ భక్తి యోగాదుల కన్నా గొప్పది. చివరకు సగుణ ధ్యానమింత వరకూ వర్ణించాడే అంతకన్నా ఉత్తమమైనది. అందుకే ఇదంతు ఇది మాత్ర మలాంటిదేదీ కాదని వాటన్నిటినీ త్రోసి పుచ్చుతున్నదీ మాట. కనుకనే గుహ్యతమం. రహస్యాలలోకి రహస్యం. ఇంతకు మించిన రహస్యం లేదు. సగుణోపాసన రహస్యమైతే దాన్ని మించిన రహస్య మీ నిర్గుణ జ్ఞానం. The top most secret. సగుణంలోనైనా జ్ఞాత జ్ఞేయమనే తేడా ఉంటుంది. ఇందులో అది కూడా లేదు. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం మూడూ మన స్వరూపమే అయినప్పుడిక తేడా ఏముంది. లేకుంటే ఇక ఆ జ్ఞానమొకరి కందించే ప్రశ్నేముంది. ఒకరనే వారేలేరు గదా. కనుక గుహ్యతమమే ఎప్పటికీ.

Page 181

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు