#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

  ఇలాంటి హామీ మనకు సప్తమంలో నవమంలోనే తప్ప మధ్యలో వచ్చిన అష్టమాధ్యాయంలో ఇవ్వడు వ్యాసమహర్షి ఇంతెందుకు. భగవత్పాదు లదే బయట పెడుతున్నారు చూడండి అవతారికలో. అష్టమే నాడీ ద్వారేణ ధారణా యోగః సగుణ ఉక్తః - అష్టమాధ్యాయంలో సుషుమ్నా నాడిద్వారా ప్రాణశక్తిని పైకి లేపి సూర్యనాడిలో ప్రవేశపెట్టి తద్వారా బ్రహ్మలోకాన్ని చేరే సగుణమైన ధారణా యోగాన్నే చెప్పింది గీత. తస్యచ ఫలం అగ్న్యర్చిరాది క్రమేణ కాలాంతరే బ్రహ్మ ప్రాప్తి లక్షణ మేవ అనావృత్తి రూపం నిర్దిష్టం. మరి దానికి ఫలం కూడా చెప్పింది. అగ్న్యర్చి రాది మార్గంలో ప్రయాణం చేసి ఉపాసకుడు కాలాంతరంలో క్రమంగా బ్రహ్మసాయుజ్యం పొందు తాడనీ వాడికి మాత్ర మా వృత్తి లేదనీ. అయితే ఇదంతా విని అనేనైవ ప్రకారేణ మోక్షప్రాప్తి ఫలమధి గమ్యతే నాన్యధా ఇతి. ఈ మార్గంలో ఉపాసన చేస్తూ పోతేనే మోక్షమనేది లభిస్తుంది. ఇంతకన్నా వేరే మార్గం లేదని మందబుద్ధులైన మానవుల కొక ఆశంక కలగవచ్చు. తదాశంకా వ్యావివర్తయిషయా భగవాను వాచ. అలాటి అపోహ పోగొట్టటానికే ఇప్పుడు మరలా కృష్ణభగవాను డుపదేశిస్తున్నాడని కుండబద్దలు కొట్టి చెప్పారు భగవత్పాదులు. కాబట్టి కేవల తత్త్వజిజ్ఞాసువులైన ఉత్తమాధికారు లష్టమాధ్యాయంలో చెప్పిన ప్రక్రియ వైపు కన్నెత్తి చూడనక్కర లేదు. దాని నాచరించట మెలాగా అని మథన పడ నక్కర లేదు. అలాటి జిజ్ఞాస లేని మధ్య మాధికారులే దానితో కుస్తీ పట్టవలసి ఉంటుంది. ఎంత కుస్తీ పట్టినా చివరకు వారు కూడా ఎక్కడో ఒకచోట ఏ లోకంలోనో నిర్గుణతత్త్వాన్ని

Page 180

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు