బ్రహ్మమే అది తన ఆత్మస్వరూపమే నని జీవ జగత్తులను కూడా తన అనుభవానికి తెచ్చుకొనే పూర్ణానుభవం కాదు. కనుక దాన్ని కూడా మించిన రహస్యమిది అని తెలపటం కోసం దీన్ని కేవలం గుహ్యమని గాక రాజగుహ్యమని వర్ణించింది గీత.
ఇదీ దీని గొప్పతనం. అసలైన బ్రహ్మ జ్ఞానమూ బ్రహ్మానుభవమూ
రెండూ కరతలా మలకంగా అందిస్తుంది మనకిది. అసలు దీనికి నాందీ
సప్తమాధ్యాయంలోనే చేశాడు వ్యాసభగవానుడు. జ్ఞాన విజ్ఞానా లవేనని
గదా పేర్కొన్నాము. అవి రెండూ అలవడితే చాలు. నేహ భూయో న్యత్
జ్ఞాతవ్య మవశిష్యతే. ఇక తెలుసుకో వలసింది ఏదీ లేదు మానవుడికి.
అది అసంశయంగా సమగ్రంగా భగవ త్స్వరూపాన్ని పట్టి ఇస్తుందని చెప్పనే
చెప్పింది అక్కడ గీత. అలాగే ఇక్కడా చెబుతున్నది చూడండి. జ్ఞానం విజ్ఞాన
సహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. జ్ఞాన విజ్ఞానాలనే మాట
లక్కడా వచ్చాయి. ఇక్కడా వచ్చాయి. అప్పటికి జ్ఞాన విజ్ఞానాలు తప్ప
జీవిత గమ్యం మరేదీ లేదన్న మాట. శాస్త్ర జన్యమైనది జ్ఞానం. అది
అనుభవంగా మారితే విజ్ఞానం. ఏదైనా అనుభవంతోనే ఆఖరు.
భగవత్పాదులు కూడా అలాగే వ్రాశారు రెండుచోట్లా. కనుకనే మోక్ష్యసే
అశుభాత్. సంసారమనే సమస్యను పూర్తిగా పరిష్కరించుకొని మానవుడు
బయటపడేది ఈ జ్ఞానవిజ్ఞానాల వల్లనే నని కూడా చాటి చెబుతున్నది
Page 179